Suhas: లక్కీ భాస్కర్ తప్పుకోకముందే మరో సినిమా రిలీజ్ కి సిద్ధం

Suhas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోల బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. కేవలం బ్యాగ్రౌండ్ వాళ్లకి సినిమా ఓపెనింగ్ వరకు మాత్రమే పనికొచ్చింది. ఆ తర్వాత వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకొని హీరోలుగా నిలద్రొక్కుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ ద్వారా వచ్చిన వాళ్ళే, అయితే బ్యాక్ గ్రౌండ్ ద్వారా వచ్చారు అని పేరే కానీ వాళ్ళకంటూ ఒక స్థాయిని, ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సాధించుకున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో స్వయంకృషితో వచ్చిన హీరోలు కూడా కొందరు ఉన్నారు. వారిలో రవితేజ దగ్గర నుంచి మొదలు పెడితే నేటి తరంలో నాని, నవీన్ పోలిశెట్టి, సుహాస్ వీళ్ళ పేర్లను చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి, సుహాస్ వచ్చిన అవకాశాలన్నింటినీ చేసేయకుండా, చాలా పద్ధతిగా ప్లానింగ్ ప్రకారం వాళ్లకు నచ్చే సినిమాలు మాత్రమే ఎంచుకొని ఆడియన్స్ మెచ్చే విధంగా చేస్తున్నారు.

సుహాస్ విషయానికి వస్తే ఇప్పటివరకు సుహాస్(Suhas) మొత్తం మూడు సినిమాలు చేశాడు. అయితే వాటిలో ఒక సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయింది. అదే కలర్ ఫోటో. ఆ సినిమాతోనే సుహాస్ మంచి పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత సుహాస్ చేసిన రెండవ సినిమా రైటర్ పద్మభూషణ్(Writter Padmabhushan). ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను కూడా అందుకుంది.

- Advertisement -

Suhas

ఇకపోతే సుహాస్ చేసిన మూడో సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా మంచి హిట్ అయిందని చెప్పవచ్చు. కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా ఈ సినిమాకి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం సుహాస్ చేస్తున్న సినిమా “జనక అయితే గనక” ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారం గా ప్రకటించింది. ఇదే డేట్ కి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేశారు కానీ ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు