Suhas : ఆట్.. కమల్ హాసన్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది గొప్ప నటులు ఉన్నారు. ఏ పాత్ర ఇచ్చినా కూడా దానిలో ఒదిగి పోవడం అనేది ఆ యొక్క నటుల శైలి. ప్రస్తుతం ఉన్న హీరోల్లో మంచి పేరు సాధించుకొని తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు సుహాస్. ఛాయ్ బిస్కెట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో కొన్ని వీడియోలు చేసుకుంటూ అక్కడ తన కెరియర్ ను మొదలుపెట్టాడు సుహాస్. యూట్యూబ్లో ఉన్నప్పుడే చాలామంది సెలబ్రిటీస్ దృష్టిలో పడ్డాడు.

సుహాస్ నటించిన మొదటి సినిమా కలర్ ఫోటో. ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. ఈ సినిమాలో సుహాస్ పర్ఫామెన్స్ చూసి చాలామంది ఫిదా అయిపోయారు.ఈ సినిమా కరోనా టైంలో రావడం వలన థియేటర్లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో మాత్రమే రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటిటిలో మంచి ఆదరణను సాధించింది. ఈ సినిమా ఒక నటుడుగా కూడా సుహాస్ కి మంచి సంతృప్తి ఇచ్చిందని చెప్పొచ్చు.

ఈ సినిమా తర్వాత సుహాస్ చేసిన సినిమా “రైటర్ పద్మభూషణ్”. రైటర్ పద్మభూషణ్ సినిమా సుహాస్ కి మంచి గుర్తింపుతో పాటు మంచి పేరును, మంచి అవకాశాలను తీసుకొచ్చి పెట్టింది. అసలు సుహాస్ ఎంచుకోవడమే మంచి మంచి కథలను ఎంచుకుంటున్నాడని చెప్పొచ్చు. ఫిలిం ఇండస్ట్రీలో ఒకసారి గుర్తింపు వచ్చింది అంటే ఒకేసారి అవకాశాలన్నీ ముందుకు వచ్చేస్తాయి. అవకాశాలన్నిటిలో ఏది మనం పిక్ చేసుకుంటే కెరీర్ లో ముందుకు వెళ్తాం అని ఆలోచించడం ఒక ఎత్తు. అలా ఆలోచించి అడుగులు వేస్తే ఎప్పటికీ కెరియర్ ఉంటుందని చాలామందికి తెలియక తప్పులు చేస్తుంటారు. ఆ విషయంలో మాత్రం సుహాస్ కి మాత్రం మంచి క్లారిటీ ఉందని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే సుహాస్ నటించిన వెబ్ సిరీస్ “ఫ్యామిలీ డ్రామా”. దీనిలో సుహాస్ నట విశ్వరూపాన్ని చూడొచ్చు అంత అద్భుతంగా చేశాడు ఈ సీరీస్ లో సుహాస్. సుహాస్ చేసిన రీసెంట్ ఫిలిం “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సుహాస్ చేసిన పర్ఫామెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. దృశ్యంత్ కటకనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. రీసెంట్ గా ఆహా లో స్ట్రీమింగ్ కి వచ్చింది ఈ సినిమా. ఆహా లో కూడా మంచి ఆదరణ పొందుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా చూసిన అందరూ కూడా సుహాస్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే సుహాస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరో విజయసేతుపతి అవుతాడు అని అంటున్నారు. ఇంకొంతమంది కమల్ హాసన్ అయిన కూడా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఒక ఫన్నీగా ఉండే డైలాగ్ ని కొంతమంది గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆట్ కమలహాసన్ అనే డైలాగ్ ను చాలా మంది సుహాస్ కి అన్వయిస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు