మాములుగా షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే ఒక కుర్రాడు. వంశీ, ప్రమోద్ , విక్కీ లు స్థాపించిన యూవీ క్రియేషన్స్ అనే బ్యానర్ కంట్లో పడ్డాడు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసిన ఆ కుర్రాడికి ఒక సినిమాను చేసే అవకాశం ఇచ్చారు యూవీ క్రియేషన్స్.24 ఏళ్లకే దర్శకుడిగా తన మొదటి సినిమాను చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఆ హిట్ అందుకున్న చిత్రమే “రన్ రాజా రన్” ఆ దర్శకుడే సుజీత్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న సుజీత్ తన రెండవ సినిమా “సాహో” భారీ స్కేల్ లో చేసాడు.ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.
ఆ చిత్రం తరువాత సుజీత్ మళ్ళీ ఇప్పటివరకు సినిమాను చెయ్యలేదు.
ఆ మధ్యకాలంలో చిరంజీవితో సినిమా రాబోతుంది అని వార్తలు వచ్చాయి.కానీ అవి ఏవి నిజం కాలేదు ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో పవన్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాను నిర్మించిన డీవివి దానయ్య ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.
We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️
Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK
— DVV Entertainment (@DVVMovies) December 4, 2022
సినిమాను అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌ను ఓజీ అని పిలుస్తారు అని రాసి ఉంది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అర్థం. అంతేకాకుండా పవన్ షాడో ను ఒక గన్‌ను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒక్క పోస్టర్‌తోనే మేకర్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకి అభిమానిగా ఉన్న సుజీత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమాను చేయడం విశేషం. ఈ తరుణంలో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఒక ట్వీట్ వేస్తూ సుజీత్ కి శుభాకాంక్షలు తెలిపాడు.
Hey @sujeethsign thanks for this fanboy moment am sure you will also give me same excitement with your upcoming project with our one and only @PawanKalyan 🔥 🔥 …all the best buddy 👍👍👍 pic.twitter.com/vlUlFqoFdD
— Harish Shankar .S (@harish2you) December 4, 2022