Sujeeth: పవన్ కళ్యాణ్ ఆ డిజాస్టర్ సినిమా నాకు చాలా ఇష్టం

Sujeeth: షార్ట్ ఫిలిమ్స్ తీయడంతో కెరీర్ మొదలు పెట్టి రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుజిత్. షార్ట్ఫిలిమ్స్ చేస్తున్న తరుణంలోనే ప్రభాస్ సుజిత్ ను పిలిపించి యువి క్రియేషన్స్ లో ఈ అబ్బాయి చాలా టాలెంటెడ్ అని చెప్పడం వలన యూ వి క్రియేషన్స్ సినిమా చేసే అవకాశం కలిగింది. అయితే శర్వానంద్ నటించిన రన్ రాజా రన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాను చేసే అవకాశం సాధించుకున్నాడు సుజిత్.

సాహో సినిమాతో బాలీవుడ్ లో గుర్తింపు

ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కెరియర్ విషయానికొస్తే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పొచ్చు. ఇక బాహుబలి సినిమా తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా సాహో. ఈ సినిమా తెలుగులో అనుకున్న విజయాన్ని సాధించలేదు. కానీ బాలీవుడ్ లో అద్భుతమైన ఘనవిజయం సాధించింది. సాహో సినిమాతో దర్శకుడుగా మంచి పేరును సంపాదించాడు సుజిత్. బాలీవుడ్లో సుజిత్ పేరు మారుమోగిపోయింది.

పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ

సాహో సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లు పాటు మరో సినిమా రాలేదు. ఇంతలోనే పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ అనే సినిమాను సుజిత్ చేస్తున్నాడు అంటూ అధికారిక ప్రకటన చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కి సుజిత్ ఎంత పెద్ద అభిమానో మనకు తెలియంది కాదు. సుజీత్ కు పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే అయింది అని వార్తలు వినిపించినప్పుడు, గబ్బర్ సింగ్ టైం లో సుజిత్ చేసిన హడావిడి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Pawan Kalyan and Renu Desai's Johnny

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇష్టమైన

ఇకపోతే కార్తికేయ గుమ్మకొండ భజే వాయువేగం అనే సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో సుజిత్ ఆ టీం తో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో మీకు ఏది ఎక్కువ ఇష్టమని అడిగినప్పుడు, నాకు జానీ సినిమా ఎక్కువ ఇష్టం అని చెప్పాడు. దీని గల కారణాలు చెప్పుకొస్తూ పవన్ కళ్యాణ్ అప్పట్లోనే అద్భుతమైన డైరెక్షన్ చేశారు. సింక్ సౌండ్ కూడా ఫస్ట్ టైం మొదలుపెట్టారు. ఆ టైంలో అంత బాగా ఎలా డైరెక్ట్ చేయగలిగారు అనిపించింది. ఆ సినిమా డిజాస్టర్ అని తెలిసిన తర్వాత కూడా ఆ జానీ అనే క్లాత్ ను నేను తలకి కట్టుకొని వారం రోజులు పాటు అలానే ఉండిపోయాను. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా రీసెంట్ గా చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27 తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు