PushpaTheRule : వెకేషన్ లో ఆ ఇద్దరూ.. తిరిగొచ్చాకే మళ్ళీ మొదలు..

PushpaTheRule : టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీస్ లవర్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో పుష్ప ది రూల్ ఒకటి. ఈ ఇయర్ భారీ అంచనాలతో తెరకెక్కిన కల్కి థియేటర్లలో వచ్చేయగా, నెక్స్ట్ దేవర రాబోతుంది. ఆ తర్వాత కల్కి కోసమే ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా దానికి తగ్గట్టే ప్రమోషన్లు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అల్లు అర్జున్ అయితే పుష్ప ఫినిష్ అయ్యేదాకా వేరే సినిమా మొదలు పెట్టకూడదని దీనిపైనే ఫోకస్ పెట్టాడు. అయితే సమ్మర్ లో రావాల్సిన సినిమా ఆగష్టు 15 కి వాయిదా వేయగా, అక్కడి నుండి ఏకంగా డిసెంబర్ 6కి వాయిదా వేసి వేశారు. అయితే మొన్నటి వరకు షూటింగ్ ఆల్మోస్ట్ 90 శాతం ఫినిష్ అయిందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప షూటింగ్ ఇంకా చాలా బాకీ ఉందట.

Sukumar and Allu Arjun on vacation. Pushpa2 shooting will start soon

వెకేషన్ లో ఈ ఇద్దరు… వచ్చాకే మొదలు..

అయితే ప్రస్తుతం పుష్ప దర్శకుడు, హీరో ఇద్దరూ కూడా వెకేషన్ లో ఉన్నారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ అమెరికాలో ఫ్యామిలీ తో వెకేషన్ లో ఉన్నాడు. కొన్ని వారాలుగా ఫ్యామిలీ తో కలిసి అక్కడే ఉంటున్నాడట సుకుమార్. నేడు గాని, రేపు గానీ USA నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉందట. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వెకేషన్ కి చెక్కేసాడు. నిన్న ఎయిర్ పోర్ట్ లో కనిపించిన అల్లు అర్జున్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం యూరప్‌లో సెలవులో ఉన్న అల్లు అర్జున్ మరో 4 నుండి 5 రోజుల్లో భారతదేశానికి తిరిగి వస్తాడని సమాచారం. ఇక వీళ్ళిద్దరూ తిరిగి వచ్చాకే పుష్ప2 మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుంది.

- Advertisement -

నెలరోజుల బాకీ.. కానీ ఇద్దరూ వెకేషన్ లో.. ఇలా అయితే ఎలా?

అయితే పుష్ప2 కి సంబంధించి ఏకంగా నెలరోజుల షూటింగ్ బాకీ ఉందని సమాచారం. ఆ నెల రోజుల షూటింగ్ కాకుండా మరో రెండు పాటల షూట్ కూడా ఉందట. మరి ఇంత షూటింగ్ పెట్టుకుని హీరో, డైరెక్టర్ వెకేషన్ లకి వెళ్ళడం పై పలు రకాల రూమర్లు వస్తున్నాయి. ఇద్దరికీ చెడిందని, అల్లు అర్జున్ రీ షూట్ కి రెడీ గా లేడని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎంత వరకు నిజముందో తెలీదు గాని, ఇంత షూట్ బాకీ పెట్టుకుని, హీరో డైరెక్టర్ వెకేషన్లకు వెళ్లడం పై ఫ్యాన్స్ కి కూడా అనుమానాలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు