Sukumar: సొంత గ్రామానికి చేరుకున్న సుకుమార్.. కారణం ఇదే..!

Sukumar: టాలెంటెడ్ దర్శకులలో ఒకరైన సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన డైరెక్షన్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సుకుమార్ ప్రజెంట్ పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప మూవీ ఎంత పెద్ద విజయం అయిందో మనందరికీ తెలిసిందే.

రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ మొదటి పార్ట్ కి గాను అల్లు అర్జున్కి నేషనల్ అవార్డ్స్ ఐటం దక్కింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ని రూపొందించేందుకు కసరత్తులు చేశారు సుకుమార్. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ తన సొంత ఊరు లో సందడి చేశాడు. తన సొంత ఊరు ఆయన మలికిపురం మండలంలోని మట్టపర్రు గ్రామానికి విచ్చేసిన సుకుమార్.. సందడి చేశారు. కుటుంబం లోని కార్యక్రమంలో పాల్గొన్నడానికి సొంత ఊరుకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు