Sukumar: కల్కి సినిమాపై సుకుమార్ రియాక్షన్

Sukumar: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ వరుసుగా సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరి దర్శకులు కంటే సుకుమార్ వర్క్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఒకవేళ సుకుమార్ సినిమా ఫెయిల్ అయిన కూడా అది చాలామందికి నచ్చుతుంది. ఆ ఫెయిల్యూర్ కి కూడా ఒక డిగ్నిటీ ఉంటుందని చెప్పొచ్చు.

సుకుమార్ కెరియర్ లో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో రంగస్థలం సినిమా అని చాలామంది చెబుతారు. కానీ పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. పుష్ప సినిమా సృష్టించిన సంచలనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప టు సినిమా కూడా రానుంది. ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవటం వలన డిసెంబర్ కి వాయిదా పడింది.

Sukumar: Sukumar's reaction on the movie Kalki

- Advertisement -

ఇకపోతే సుకుమార్ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక సినిమాను చూసినప్పుడు తనకు ఆ సినిమా నచ్చితే సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాను ప్రశంసిస్తారు. ఇక నాగ అశ్విన్ తీసిన కల్కి సినిమాపై కూడా సుకుమార్ ప్రశంసలు కురిపించారు. సినిమాపై తన ఫీలింగును వ్యక్తపరిచారు. ఇంస్టాగ్రామ్ వేదిక స్టోరీ షేర్ చేసి అన్ బిలియబుల్ అంటూ సుకుమార్ రాసుకు వచ్చారు. సుకుమార్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ అన్ బిలియబుల్ అన్నారు అంటే అది ఎంత పెద్ద కాంప్లిమెంటు మనం అర్థం చేసుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు