Suma Kanakala : యాంకరింగ్ పక్కన పెట్టి కొత్త పని చూసుకున్న సుమ… ఇలా మారిపోయిందేంటి?

Suma Kanakala : సుమ కనకాల… ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 30 ఏళ్లుగా సుమా బుల్లితెర మహారాణిగా కొనసాగుతోంది. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వచ్చారు వెళ్లారు. కానీ ఒక్కరు కూడా కనీసం ఆమె దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు. ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న సుమ టీవీ షోలే కాదు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు ఇలా బుల్లితెర నుంచి వెండితెర దాకా ఏం జరిగినా సరే సుమ ఉండి తీరాల్సిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ యాంకరింగ్ ను పక్కన పెట్టి కొత్త అవతారం ఎత్తింది. ఆమెను అలా చూసిన అభిమానులు సుమ ఏంటి ఇలా తయారయింది అంటూ షాక్ అవుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే…

మలయాళీ అయినప్పటికీ పదహారణాల తెలుగమ్మాయిలా రెడీ అయ్యి, అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడే సుమా కామెడీ టైమింగ్, పంచ్ లతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది సుమకు. అలా స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా తనదైన ముద్ర వేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన సుమ లేకుండా టాలీవుడ్ లో ఎలాంటి బిగ్ ఈవెంట్ జరగదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి కూడా సుమా షోలకు టెలివిజన్ లో మంచి టిఆర్పి రేటింగ్ వస్తుంది.

Suma Kanakala Biography: Career, Movies, Images, Tv Shows

- Advertisement -

అయితే ఇండస్ట్రీలో సుమ యాంకరింగ్ కు ఎప్పుడు బ్రేక్ ఇస్తుంది అనేది తరచుగా హాట్ టాపిక్కే. అలా ఆలోచించే వాళ్ళ కోసమే తాజాగా కాస్త బ్రేక్ ఇచ్చింది సుమ. ఏకంగా వరి చేలో కూలిగా మరి సర్ప్రైజ్ చేసింది. తాజాగా సుమ తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో వరి పంట గురించి వివరంగా వెల్లడిస్తూ అన్నం మన కంచంలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది? రైతులు ఎంత కష్టపడతారు అనే విషయాలను వివరంగా వెల్లడించింది. అంతేకాకుండా ఏకంగా రైతులా మారి వరి చేలో నాటు వేసింది. ఫార్మింగ్ చేస్తే నేచర్ తో కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది అంటూ కొన్నిసార్లు అలా వెళ్లి, ఆ ఫీలింగ్ ను ఎక్స్పీరియన్స్ చేయాలని ఆ పోస్టులఓ రాసుకొచ్చింది. అంతేకాకుండా మా కోసం ఇంతగా కృషి చేస్తున్న ఫార్మర్లందరికీ సెల్యూట్ చెప్పింది. అయితే నాటు వేయడానికి ట్రై చేసి అరగంట గంటలోనే అలసిపోయింది సుమ. కానీ ఊర్లలో ఉండే మహిళలు రోజంతా వ్యవసాయం చేస్తూ ఇంటిని మేనేజ్ చేయడం ప్రశంసనీయం అంటూ వారిపై అభినందనలు వర్షం కురిపించింది.

యాంకరింగ్ కు బ్రేక్…

కాగా ఇప్పటికే ఎన్నోసార్లు సుమ యాంకరింగ్ కు బ్రేక్ ఇస్తుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేస్తూ మరింత జోష్ తో యాంకర్ గా రాణిస్తోంది సుమ. ఇప్పుడిప్పట్లో ఆమె బుల్లితెర మహారాణి అనే బిరుదును పక్కన పెట్టేలా కనిపించట్లేదు. ఒకవేళ ఆమె యాంకరింగ్ నుంచి తప్పుకున్నా సుమ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న యాంకర్ ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో లేరు అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు