Sumalatha: దర్శన్ పై ప్రముఖ హీరోయిన్ కామెంట్స్.. నిజం బయటికి రావాలంటూ..?

Sumalatha: గడిచిన కొద్ది రోజుల నుంచి కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో దర్శన్.. రేణుకా స్వామి హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో కేసు నమోదు అవ్వడంతో ప్రస్తుతం జైలులో తన జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు, చాలామంది సినీ ఇండస్ట్రీకి చెందినవారు కూడా దర్శన్ అలాంటి వ్యక్తి కాదు అంటూ కితాబు ఇస్తున్నారు..ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా అలనాటి హీరోయిన్ , మాజీ ఎంపీ సుమలత అంబరీష్ కూడా దర్శన్ కు మద్దతుగా నిలిచింది. సుమలత కు, హీరో దర్శన్ కి మంచి స్నేహబంధం ఉన్నది. ఈ క్రమంలోనే ఈమె నటుడు దర్శన్ పైన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మాట్లాడు..

Sumalatha: Famous heroine's comments on Darshan.. The truth should come out..?
Sumalatha: Famous heroine’s comments on Darshan.. The truth should come out..?

దర్శన్ పై సుమలత స్పందన..

హీరోయిన్ సుమలత కూడా దర్శన్ కేసు పైన సోషల్ మీడియాలో మాట్లాడకపోవడంతో.. చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. దీంతో ఆమె స్పందిస్తూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది.. ఆ లేఖలో ఇలా రాసుకొస్తూ.. అందరికీ నమస్కారం ..44 ఏళ్ల నా సినీ కెరియర్లో నటిగా, కళాకారిణిగా .. గడిచిన ఐదేళ్లుగా ఎంపీగా ప్రజా జీవితాల్లోనే నా జీవితాన్ని గడిపేస్తున్నాను. నటిగానే కాకుండా భార్యగా, తల్లిగా ఇలా ఎన్నో విషయాలలో నా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతి బాధ్యతను నేను సీరియస్ గానే తీసుకున్నాను..

రేణుక స్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..

అయితే ఈ రోజున కొన్ని విషయాలను నేను స్పష్టం చేయాలనే ఆలోచనలతో ఈ పోస్టును పంచుకుంటున్నాను అంటూ వెల్లడించింది. ముఖ్యంగా మీడియాలో లేదా నెట్టింట వచ్చే ఊహాగానాలను మాత్రం తాను ప్రోత్సహించకూడదంటూ తెలిపింది. ముందుగా కొడుకును, భర్తను కోల్పోయినటువంటి రేణుక స్వామి తల్లిదండ్రులకు భార్యకు తన సానుభూతిని తెలియజేస్తున్నానంటూ తెలియజేసింది. ఈ బాధను ఎదుర్కొనేందుకు శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలంటూ కోరుకుంటున్నాను అని తెలియజేసింది.

- Advertisement -

దర్శన్ కొడుకు లాంటివాడు అంటున్న సుమలత..

తనకు న్యాయవ్యవస్థ మీద గట్టి నమ్మకం ఉందని.. దర్శన్ సంఘటన విన్నప్పటి నుంచి తన హృదయం చాలా కలచి వేస్తోందని.. తను చాలా రోజులపాటు దీనిని అర్థం చేసుకోలేకపోయానని తెలిపింది. దర్శన్ తనకు స్టార్ హీరో కాకముందే 25 సంవత్సరాలుగా తెలుసు అని, తన కుటుంబ సభ్యులు మంచివారు అని, దర్శనం కూడా తనకు కొడుకు లాంటివాడు అంటూ తెలిపారు. తనకు తల్లి గౌరవం ఇవ్వడంతో దర్శన్ కు కొడుకు స్థానం ఇచ్చానని తెలిపింది.

నిజాలు బయటకు రావాలి..

దర్శన్ ప్రేమగల హృదయంతో చాలా శ్రద్ధ కలిగిన వ్యక్తి అని.. తనకి మాత్రమే తెలుసు. జంతువుల పట్ల అతని ప్రేమ స్ఫూర్తి ఎల్లప్పుడూ కూడా మంచి స్వభావంతోనే కలిగి ఉంటారని తెలిపారు. ఇలాంటి పని చేసే అంత వ్యక్తిత్వం దర్శన్ లో లేదని కూడా తాను నమ్ముతున్నానని తెలిపింది సుమలత. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందువలన తాను ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడలేనంటూ సోషల్ మీడియాలో కేవలం దర్శన్ తో పాటు ఆయన భార్య, కొడుకులను టార్గెట్ చేయడం చాలా అన్యాయం అంటూ తెలిపింది. పోలీసులపైన న్యాయస్థానం పైన నమ్మకం ఉంది వారి పని వారు చేసుకుంటారంటూ తెలిపింది. ముఖ్యంగా దర్శన్ ఈ కేసులో నిందితుడు అంటూ ఎక్కడ రుజువు కాలేదు..కనీసం దోషిగా కూడా నిర్ధారించబడలేదు అంటూ తెలిపింది. దర్శన్ సినిమాల పైన వేలాదిమంది జీవనోపాధి ఆధారపడి ఉంది.. వీటన్నిటిని ఎదుర్కోవడం అంత సులమైన పని కాదు అంటూ తెలిపింది. నిజం బయటికి రావాలని అందరికీ న్యాయం జరగాలి అంటూ వారి తల్లిగా తాను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ తెలియజేసింది సుమలత.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు