Suman: కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. వారిని ఉద్దేశించేనా..?

Suman: ప్రముఖ సీనియర్ హీరో సుమన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత హీరోగా నటించి ఇప్పుడు విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే స్టార్ హీరోగా ఉన్నత పొజిషన్లో ఉండాల్సిన సుమన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడం వెనుక పెద్ద కథ ఉంది.. ఆయనను కొంతమంది నీలి చిత్రాల కేసులో ఇరికించి.. ఆరు నెలలు జైలులో పెట్టించిన విషయం తెలిసిందే.. సుమన్ కెరియర్ లో ఇది ఒక మాయని మచ్చ అదే ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. లేదంటే ఇప్పుడు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున తరహాలో ఆయన కూడా మంచి స్థానంలో ఉండేవారు.. ఈ క్రమంలోనే తనకు జరిగిన అన్యాయం గురించి, దాని ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి నోరు విప్పారు.

Suman: Karma doesn't leave anyone.. Do you mean them..?
Suman: Karma doesn’t leave anyone.. Do you mean them..?

అమ్మ కన్నీరు పెట్టుకుంది..

తాజాగా సుమన్ మాట్లాడుతూ.. కావాలనే నన్ను ఇబ్బందుల్లో పడేశారు. అప్పుడు మా అమ్మ కన్నీరు కార్చింది.. అమ్మ పడ్డ కష్టాలు వర్ణనాతీతం.. అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎవరో కుట్ర చేశారని అంటూ ఉంటారు. అది ఎవరు అనేది నాకు కూడా తెలియదు. కానీ ఎవరైనా దాని ఫలితాలు అనుభవించాల్సిందే. ఈ ఘటన వల్ల నేను ఇప్పుడు పెద్దగా బాధపడడం లేదు కానీ ఆ సమయంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను .ఆరు నెలలు చాలా కష్టంగా ఉండింది. కానీ ఇప్పుడు దాన్ని పెద్దగా నేను పట్టించుకోవడం లేదు. అయితే అమ్మ విషయంలో మాత్రం చాలా బాధ ఉంది. ఆ సమయంలో అమ్మ ఏడ్చింది ..ఎంతో స్ట్రగుల్ అయింది.. ఆ ఘటన నాకంటే అమ్మకి ఎక్కువగా దెబ్బ కొట్టింది. ఆమె చాలా కృంగిపోయింది . ఆమె బాధ నేను మరణించేంతవరకు నన్ను వెంటాడుతూనే ఉంటుంది అంటూ వెల్లడించారు సుమన్.

కర్మ ఎవరినీ వదిలిపెట్టదు..

అంతేకాదు సుమన్ మాట్లాడుతూ.. ఇక్కడ ఎవరు చేశారు అనేది తెలియదు కానీ ..నేను దేనికో ఈ కర్మ అనుభవించాను.. అలాగే నాకు ఎవరు అన్యాయం చేసినా.. వాళ్లు ఆ కర్మ కచ్చితంగా అనుభవిస్తారు.. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు సుమన్.. ప్రస్తుతం చాలామందిని చూశాము.. ఇలా అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారు.. నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు భయపడతాను.. సుమన్ భోళాశంకరుడేం కాదు. లోపల వేరే సుమన్ ఉన్నాడు.. ఇతరులను శిక్షించడానికి అనడానికి నేను ఎవరిని? అంటూ ప్రశ్నించారు.. ఒకటికి రెండుసార్లు చెబుతాను.. వినకపోతే పంపిస్తాను.. నా స్టాఫ్ విషయంలో కూడా అంతే ఎవరిని శిక్షించడానికి నేను అర్హుడిని కాదు. అంటూ తెలిపారు సుమన్

- Advertisement -

నీలి చిత్రాల కేసులో సుమన్..

గతంలో నీలి చిత్రాల కేసులో జైలు పాలు అయిన విషయం తెలిసిందే.. ఇందులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, డీజీపీ, ఒక రౌడీషీటర్ ప్రమేయం ఉందని, ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సాగర్ తెలియజేశారు.. కానీ ఎంజీఆర్ మరణించారు. అందుకే కర్మ ఎవరిని వదిలిపెట్టదని సుమన్ వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు