Sundeep Kishan: డ్రగ్స్, ఆల్కహాల్ సీన్స్ ఉన్నాయని బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్నాడు

Sundeep Kishan: కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు రైట్ అవుతాయి ఇంకొన్నిసార్లు రాంగ్ అవుతాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చాలా కథలను వదులుకున్నారు. అయితే అవి వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలకు జరిగింది. పూరి జగన్నాథ్ రాసిన ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ అప్పట్లో వదులుకున్నాడు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా చాలామంది ఏం హీరోస్ చాలా సినిమాలు వదులుకున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా ను మొదట ప్రభాస్ కి చెప్పాడంట రాజమౌళి అయితే ప్రభాస్ దానికి ఒప్పుకోలేదు.

ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ కిషన్ హీరోగా కంటే ముందు కొన్ని సినిమాల్లో కొన్ని కీలక పాత్రలలో కనిపించాడు. దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన ప్రస్తానం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో శర్వానంద్ కి తమ్ముడు గా కనిపించాడు సందీప్ కిషన్. ఆ సినిమాలో సందీప్ కిషన్ పాత్ర కొంచెం భిన్నంగా ఉంటుంది అని చెప్పొచ్చు. తండ్రి మాట వినకుండా గొడవల్లో తలదూరుస్తూ, నిత్యం తాగుతూ డ్రగ్స్ కొట్టే ఒక క్యారెక్టర్ లో ఉంటుంది.

Sundeep Kishan

- Advertisement -

 

ఇక ఆ సినిమా అయిపోయిన తర్వాత కొన్నేళ్ల పాటు మిగతా సినిమాలు చేశాడు సందీప్ కిషన్. ఈ ప్రాసెస్ లో సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి అనే కథను కూడా సందీప్ కి వినిపించాడు. అయితే ఈ సినిమాలో డ్రగ్స్ కొట్టే సీన్స్, తాగే సీన్స్ ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు సందీప్ కిషన్. అలా సందీప్ కిషన్ రిజెక్ట్ చేసిన కథను విజయ్ దేవరకొండ తో తెరకెక్కించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అద్భుతమైన హిట్ సినిమాను అందించాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన ప్రతిభను చూపించి అనిమల్ సినిమాతో కాసుల వర్షం కురిపించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు