Ramam Raghavam : ‘నాయుడన్న’ గా సునీల్.. సరికొత్తగా

Ramam Raghavam : టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న వారు ఎవరైనా సరే, ఏదో ఒకరోజు తమని తాము నిరూపించుకొని పలు విభాగాల్లో సక్సెస్ అవ్వాలని ఎంతో మంది ట్రై చేస్తారు. కానీ కొంతమందే సక్సెస్ అవుతారు. ఇక ఆ కోవలో చాలా మంది నటులు దర్శకులుగా కూడా సక్సెస్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ కమెడియన్ వేణు యెల్దండి కూడా బలగం తో మంచి అభిరుచి గల డైరెక్టర్ గా తన ప్రతిభను బయట పెట్టాడు. ఇక ఈ ఇయర్ కూడా అలాంటి కమెడియన్ దర్శకుడిగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ధనాధన్ ధనరాజ్, చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీ లో చేస్తూ, జబర్దస్త్ షో తో మరింత ఫేమస్ అయి ఇప్పుడిప్పుడే సినిమాల్లో పెద్ద పాత్రలు వేస్తున్నాడు. ఇక తాజాగా ధనరాజ్ ఒక ఫీల్ గుడ్ డ్రామాతో దర్శకుడిగా సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాయే “రామం రాఘవం”. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మంచి అంచనాలను పెంచేసింది.

తండ్రి కొడుకుల అనుబంధంతో..

ఇక ధనరాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ (Ramam Raghavam) సినిమాను స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో తెరకెక్కుతుంది. తెలుగు, మరియు తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ధనరాజ్ హీరోగా స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా. తండ్రి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ ను కళ్ళకు కట్టినట్లు టీజర్ లో చూపించగా, సినిమా కూడా మెప్పిస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా ఈ సినిమాలో మరో విలక్షణ నటుడు భాగమయ్యాడు.

Suneel As Nayudanna role in Ramam Raghavam movie

- Advertisement -

నాయుడన్న గా సునీల్..

ఇక ధనరాజ్ దర్శకత్వం వహిస్తున్న రామం రాఘవం సినిమాలో మరో ప్రత్యేక పాత్రలో సునీల్ నటిస్తున్నాడని కంఫర్మ్ చేసారు. టాలీవుడ్ లో కమెడియన్ గా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా, ఇప్పుడు విలన్ గానూ సక్సెస్ అయి విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పుష్ప ది రూల్, గేమ్ ఛేంజర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు రామం రాఘవం లో నాయుడన్న పాత్రలో సునీల్ నటిస్తున్నాడని అనౌన్స్ చేయగా, తాజాగా ఆ పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిల్వేరు సంగీతం అందిస్తున్నాడు, ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. ఇక జూన్ లో గాని జులై లోగాని ‘రామం రాఘవం’ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు