Sunil New Movie : బిల్లాగా కామెడియన్ సునీల్… సూటు బూటు, సీరియస్ లుక్‌తో భయపడుతున్నాడుగా..

Sunil New Movie : కమెడియన్, హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సునీల్ పుష్పతో మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఇతర భాషల ఇండస్ట్రీల నుంచి కూడా వరుసగా అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సునీల్ సూటు బూటు ధరించి న్యూ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఈసారి ఆయన ఆటో బిల్లాగా కనిపించబోతున్నాడు. మరి సునీల్ కొత్త అవతారం సంగతులను తెలుసుకుందాం.

ఆటో బిల్లాగా…

ఈ సంవత్సరం మొదట్లో మమ్ముట్టి బ్రహ్మయుగంతో సూపర్‌ హిట్ సాధించాడు. ఈ హారర్ థ్రిల్లర్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డును సృష్టించింది. ప్రస్తుతం భ్రమయుగం మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ తో ఉన్న మమ్ముట్టి నటిస్తున్న కొత్త మూవీ టర్బో. ఈ చిత్రాన్ని మే 23న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమాలో నుంచి సునీల్ లుక్ బయటకు వచ్చింది. అందులో సునీల్ సూటు బూటు ధరించి న్యూ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ఆయన ఆటో బిల్లా అనే పాత్రలో నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. లుక్ చూస్తుంటే సునీల్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రను పోషించబోతున్నట్టు అన్పిస్తోంది.

అంచనాలు పెంచేసిన ట్రైలర్

తాజాగా విడుదల చేసిన టర్బో థియేట్రికల్ ట్రైలర్ యాక్షన్, డ్రామా అంశాల మిక్స్‌తో చాలా ప్రామిసింగ్‌గా ఉంది. మమ్ముట్టి 72 ఏళ్ల వయసులో కూడా తన నటనతో ఆశ్చర్యపరిచాడు. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీతో యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టాడు. ట్రైలర్ చూశాక మమ్ముట్టి ఈ సినిమాతో ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని నమ్ముతున్నారు ఆయన అభిమానులు. మరి ఇందులో సునీల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

మలయాళంలో ఇదే మొదటి మూవీ

పుష్ప సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించి అదరగొట్టాడు సునీల్. ఆ సినిమా తరువాత ఆయనకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు దక్కింది. అంతకంటే ముందే పలు భాషల్లో సునీల్ కు నటించే అవకాశం దక్కినప్పటికీ, పుష్ప తరువాత అన్ని భాషల మేకర్స్ కు సునీల్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయ్యారు. అందుకే ఆయనకు తమిళ, మలయాళ భాషల సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. కాగా సునీల్ టర్బో మూవీతోనే మలయాళంలో అడుగు పెట్టబోతున్నారు. ఇదే ఆయనకు అక్కడ ఫస్ట్ మూవీ. మొదటి సినిమాకే మమ్ముట్టి లాంటి స్టార్ తో కలిసి నటించే అవకాశం సునీల్ కు రావడం విశేషం.

సునీల్ తమిళ సినిమాలు

ఈ ఏడాది ప్రారంభంలో తమిళంలోకి అడుగు పెట్టిన సునీల్ అక్కడ కూడా అదరగొడుతున్నాడు. ఆయన ఇప్పటిదాకా తమిళంలో మావీరన్, జైలర్, మార్క్ ఆంటోనీ, జపాన్ వంటి చిత్రాలలో నటించి తమిళ తంబీలను కూడా మెప్పించాడు. ప్రస్తుతం తెలుగులో సునీల్ పుష్ప 2, గేమ్ ఛేంజర్ వంటి పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు