Sunil: తెలుగులో మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా బిజీగా మారిన సునీల్

Sunil: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కమెడియన్ లో సునీల్ ఒకరు. కేవలం సునీల్ కామెడీ కోసమే థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ కూడా ఉన్నారు. నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావ్ మన్మధుడు చిరునవ్వుతో మనసంతా నువ్వే వంటి ఎన్నో సినిమాల్లో సునీల్ కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. వీటన్నిటిని మించి శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన సొంతం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో సునీల్ కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉంటుంది. సునీల్ కోసమే ఈ సినిమాని రిపీటెడ్ గా చూసిన ఆడియన్స్ ఉన్నారని చెప్పొచ్చు.

Sunil

భీమవరం కి చెందిన సునీల్ మెగాస్టార్ చిరంజీవికి బీభత్సమైన ఫ్యాన్. వాళ్ళ ఇంటి పక్కనుండే నటరాజ్ థియేటర్ లో చిరంజీవి సినిమా ఆడుతున్నప్పుడు వచ్చే సౌండ్స్ కి పక్కనున్న గుడిలో డాన్స్ చేస్తూ ఉండేవాడు. అలా చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలో తనను తాను నిలబడటానికి చాలా కష్టాలు పడ్డాడు. ఈ తరుణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఫ్రెండ్షిప్ కుదిరింది. వీరిద్దరూ కలిసి దాదాపు రూమ్మేట్స్ గా చాలా ఏళ్లు గడిపారు. ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం అద్భుతంగా ఉంటుంది.

- Advertisement -

ఇకపోతే సునీల్ మొదట విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకుందామని అనుకున్నాడు. అయితే త్రివిక్రమ్ రైటింగ్ వలన కమెడియన్గా సెటిల్ అయిపోయాడు. మొత్తానికి విలన్ గా చేయాలనే కోరిక సునీల్ లో అలా ఉండిపోయింది. అయితే సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో విలన్ గా కనిపించాడు సునీల్. అయితే పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా తర్వాత సునీల్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా సునీల్ చాలా బిజీగా మారిపోయాడు. ఎన్నో తమిళ్ సినిమాలు చేశాడు సునీల్. ఇప్పుడు ప్రస్తుతం అజిత్ సినిమాలో కూడా సునీల్ నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు