Sunny leone: టాలీవుడ్ రీ ఎంట్రీ కి సర్వం సిద్ధం.. బోల్డ్ బ్యూటీని ఆపేదెవరు..?

Sunny leone.. బాలీవుడ్ బ్యూటీ అందాల తార బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ త్వరలో టాలీవుడ్ లోకి రీయంట్రీ ఇవ్వబోతోంది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది ఈ ముద్దుగుమ్మ. బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న క్యూజీ అనే సినిమాలో ఈమె నటించబోతోంది. ఇందులో సారా, ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా కీలక పాత్రలో సన్నిలియోన్ కనిపిస్తుంది అని సమాచారం. అంతేకాదు ఇందులో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా కనిపించబోతున్నారట. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Sunny leone: All set for Tollywood re-entry.. Who will stop the bold beauty..?
Sunny leone: All set for Tollywood re-entry.. Who will stop the bold beauty..?

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సన్నీలియోన్..

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి అంతేకాదు కొద్ది రోజుల క్రితం టీజర్ కూడా విడుదల అవ్వగా ఇది కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. క్రైమ్ సిండికేట్ గ్యాంగ్ గా ఏర్పడిన కొంతమంది మహిళలు ఎలా హత్యలకు పాల్పడ్డారు..? వారంతా కిల్లర్ గా మారడానికి గల కారణాలేంటి? అడ్డొచ్చిన వారిని ఎలా క్రూరంగా చంపారు ?అనే విషయాలను చాలా అద్భుతంగా చూపించారు. బోల్డ్ క్రైమ్ అంశాలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మనకు టీజర్ చేస్తే అర్థమవుతుంది. సాధారణంగా చాలా సినిమాలలో మనకు సీరియల్ కిల్లర్ పురుషులను మాత్రమే చూపించారు. కానీ ఇందులో మొదటిసారి కిల్లర్స్ గా ఆడవారిని చూపించబోతున్నారు మరి ఈ సరికొత్త ప్రయోగం వీరికి ఇలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

క్యూజీ సినిమాలో కీలక పాత్ర..

ఇకపోతే ఇందులో భారీ తారాగణం నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. జాకీ ష్రాఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా నటన సినిమాకి హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది త్వరలోనే బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ చిత్రాన్ని హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు మొత్తం ఐదు భాషలలో సినిమాను విడుదల చేసేందుకు సన్న హాలు చేస్తున్నారు మేకర్స్. ఇక డ్రమ్స్ శివమణి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు.

- Advertisement -

సన్నీలియోన్ సినిమాలు..

ఇకపోతే సన్నీలియోన్ విషయానికొస్తే.. తెలుగులో మంచు మనోజ్ నటించిన కరెంటు తీగ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సన్నీలియోన్ తర్వాత మంచు విష్ణు జిన్నా సినిమాలో నెగిటివ్ షేడ్స్ తో కూడిన క్యారెక్టర్ లో ఆకట్టుకుంది అంతేకాదు గరుడవేగ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో స్పెషల్ రోల్స్ , సాంగ్స్ చేసిన ఈమె ఇప్పుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది. అసలే బోల్డ్ బ్యూటీ ఇప్పుడు ఇందులో క్రైమ్ మూవీలో నటిస్తోంది. మరి ఈ బోల్డ్ బ్యూటీ అరాచకాన్ని ఆపేదెవరో..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు