Sunny Leone : నోట్లో నుంచి రక్తం… దయనీయమైన స్థితిలో శృ*గా*ర తార..!

Sunny Leone..ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ (Sunny Leone)టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తున్న ఈమె , 2014లో రాగిణి ఎంఎంఎస్ -2 అనే చిత్రం తో హిందీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనతో యువతను విపరీతంగా ఆకట్టుకొని, భారీ పాపులారిటీ దక్కించుకుంది. అయితే అంతకుముందు ఆమెపై వ్యతిరేకత పూర్తిస్థాయిలో వచ్చింది. ఎందుకంటే బాలీవుడ్ లోకి రాకముందు ఎక్కువగా అశ్లీల చిత్రాలలో నటించడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ తర్వాత వాటి అన్నింటినీ వదిలేసి బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అలా పలు భాషా చిత్రాలలో నటిస్తూ మంచి పేరు అందుకుంది సన్నీ లియోన్.

Sunny Leone : Bleeding from the mouth.. Star heroine in miserable condition..!
Sunny Leone : Bleeding from the mouth.. 

నోట్లో నుంచి రక్తం.. దయనీయమైన స్థితిలో..

ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. అందులో నోటితో పాటూ మొహమంతా రక్తంతో నిండిపోయింది. పైగా రక్తపు ధారలతో దయనీయమైన స్థితిలో కనిపించింది శృంగార తార సన్నీలియోన్. ఇది చూసిన అభిమానులు ఏమైందంటూ టెన్షన్ పడుతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. నా శ్రమకు ప్రతిఫలమే ఈ రక్తం, చెమట. రక్తం, కన్నీళ్ళతో వచ్చిన శ్రమ మిమ్మల్ని బ్రాండ్ గా తయారు చేస్తాయి అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది సన్నీ లియోన్. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే మొహంపై రక్తపు ధారలతో ఉన్న సన్నీ లియోన్ ను చూసి అభిమానులు ఏమైంది అంటూ కంగారుపడుతూ ఫోటోల కింద పోస్ట్ పెడుతున్నారు.

Sunny Leone : Bleeding from the mouth.. Star heroine in miserable condition..!
Sunny Leone 

తెలుగులో రీ ఎంట్రీ..

ఇకపోతే ఈ ఫోటో కొటేషన్ గ్యాంగ్ అనే సినిమా షూటింగ్ కి సంబంధించింది అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారానే సన్నిలియోన్ తెలుగులో రీయంట్రీ ఇవ్వబోతోంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో మళ్లీ తన బ్రాండ్ ను పరిచయం చేయబోతోంది సన్నిలియోన్. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

సన్నీలియోన్ కెరియర్..

సన్నీలియోన్ కెరియర్ విషయానికి వస్తే.. జిస్మ్ 2 అనే చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత రాగిణి ఎంఎంఎస్ 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మంచు హీరో మంచు మనోజ్ నటించిన కరెంటు తీగ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఏక పహేలి లీల, కుచ్ కుచ్ లోచా హై వంటి హిందీ సినిమాలలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం కండోమ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె.. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు పోర్న్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె అదే రంగంలో అనేక అవార్డులను సైతం దక్కించుకుంది. ఏది ఏమైనా ఆ రంగం నుంచి బయటికి వచ్చి ఇప్పుడు నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది సన్నీ లియోన్.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు