Sunny Leone : అలాంటి బిజినెస్ లో టాప్ లో దూసుకుపోతున్న బోల్డ్ బ్యూటీ!

Sunny Leone : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బోల్డ్ మూవీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ శృంగార తార పెళ్లి చేసుకుని కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అంతే కాదు పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ చేతినిండా సంపాదిస్తుంది. అంతే కాదు పలు వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తుంది. మొన్నటివరకు బాలీవుడ్ కే సుపరిచితమైన ఈ భామ టాలీవుడ్ కి కూడా బాగా దగ్గరయింది. తెలుగులో ఆ మధ్య కరెంట్ తీగ, గరుడ వేగ, జిన్నా భాయ్ సినిమాల్లో నటించి మెప్పించింది సన్నీ. ఇదిలా ఉండగా బోల్డ్ బ్యూటీ సన్నిలియోన్ వ్యాపార రంగంలోనూ భారీగా దూసుకుపోతోంది. సన్నీ లియోన్ తన భర్త తో కలిసి పలు బిజినెస్ లు చేస్తుండగా, అందులో ఓ బిజినెస్ లో మాత్రం మంచి ప్రాఫిట్స్ ని అందుకుంటుంది.

SunnyLeone who is successful in start struck cosmetics business

స్టార్ స్ట్రక్ లో దూసుకుపోతున్న సన్నీ…

బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ ఆ మధ్య ‘స్టార్ స్ట్రక్’ పేరుతో కాస్మెటిక్ బ్రాండ్ బిజినెస్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బిజినెస్ లో సన్నీ మంచి లాభాలని అందుకుంతుందట. సన్నీ కి ముందునుండే వరల్డ్ వైడ్ గా శృంగార తారగా బాగా పాపులర్. ఇక పెళ్లయ్యాక సన్నీ లియోన్ తాను చేసే మంచి పనుల ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది. పెళ్లి తర్వాత డీసెంట్ మూవీస్ లో నటిస్తొ, ఇతరులకు సహాయం చేస్తూ, భర్తతో కలిసి పలు వ్యాపారాలను నిర్వహిస్తుంది. ఇక కొనేళ్ల కింద అంటే.. 2018లో సన్నీ లియోన్ బ్రాండ్ “స్టార్ స్ట్రక్” ను ప్రారంభించింది. సినిమాల్లో నటిస్తూనే తన బ్రాండ్స్ ని పలు ఈవెంట్లలో కూడా ప్రచారం చేస్తోంది. తన కాస్మెటిక్ బ్రాండ్ అయిన స్టార్ స్ట్రక్ దుబాయ్, అబుదాబి, లండన్, ముంబై, బెంగళూరులతో పాటు ఇప్పుడు ఒడిశా లోనూ ప్రారంభమైంది. లాస్ట్ ఇయర్ బెంగళూరు లో స్టార్ట్ చేసిన సన్నీ, ఇప్పుడు ఒడిస్సా లో తన కాస్మెటిక్ బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించింది.

- Advertisement -

బిజినెస్ ని దగ్గరుండి చూస్తున్న డేనియల్..

ఇక సన్నీ లియోన్ (Sunny Leone) చేస్తున్న ఈ బిజినెస్ ని ఆమె భర్త ‘డేనియల్ వెబర్’ దగ్గరుండి స్టార్ స్ట్రక్ ని చూసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ఒడిశా లో బ్రాంచ్ ని సుకీర్తి పట్నాయక్ అనే వ్యక్తి చేసుకుంటున్నాడట. అలాగే అతి త్వరలోనే హైదరాబాద్ లో కూడా ఈ స్టోర్ ని ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇక ఇటు బిజినెస్ రంగంలో రాణిస్తూనే సన్నీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం సన్నీలియోన్ హిమేష్ రేషమ్మియా మరియు ప్రభుదేవాతో ఓ మలయాళ ప్రాజెక్టులో నటిస్తోంది. అలాగే కన్నడలో ఉపేంద్ర తెరకెక్కిస్తున్న UI లో కూడా నటిస్తుంది. ఇలా తన సినిమాల్లోనూ, అలాగే తన బ్యూటీ బ్రాండ్ బిజినెస్ లోనూ సన్నీ లియోన్ టాప్ లో దూసుకుపోతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు