Akhil akkineni: మహేష్‌కి నచ్చిన ఏజెంట్

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్నఏజెంట్ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ చాలా ఎక్సట్రార్డినరీ విజువల్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అఖిల్ యాక్టింగ్ అందరికి బాగా నచ్చింది. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ చేసాడు అని అందరు ప్రశంశిస్తున్నారు.

ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. దాదాపు సంవత్సరం పాటు బాడీ ఒకేలాగ మెయింటైన్ చేయడానికి అఖిల్ తనకి ఇష్టమైన ఫుడ్ కి కూడా చాలా రోజులు దూరంగా ఉన్నాడు. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ తనవంతు ప్రయత్నం ఎంత చేయాలో అంత చేసాడు.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటివలనే కాకినాడ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అఖిల్ మాట్లాడుతూ ” ఈ సినిమా వల్ల లైఫ్ లో చాలా నేర్చుకున్నాను. అప్ అండ్ డౌన్స్ చాలా చూసాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ ఏజెంట్ గా కనిపించనున్నారు. మలయాళం యాక్టర్ మమ్ముట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. .

- Advertisement -

కొత్త సినిమాలని, కొత్తగా చేసే ప్రయోగాలని ఎంకరేజ్ చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజెంట్ సినిమా ట్రైలర్ చూసి అఖిల్ ని విష్ చేసారు “ఏజెంట్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. అఖిల్ ట్రాన్సఫర్మేషన్ బాగా నచ్చింది అని అనిల్ సుంకర ఇంత గ్రాండ్ స్కేల్ లో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీం ఏజెంట్ సినిమా అందరికి నచ్చేవిధంగా ఉంటుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ప్రమోషన్స్ లో సురేందర్ రెడ్డి కనిపించకపోవటం గమనార్హం

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు