Mosagallaku Mosagadu: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న సూపర్ స్టార్ సినిమా

లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో డేరింగ్& డాషింగ్ హీరోగా నటశేఖరుడిగా అభిమానులచేత నిరాజనాలందుకున్న నటుడాయన. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ లో నెంబర్ వన్ స్థానానికి పోటీనిచ్చిన హీరో. అల్లూరి సీతారామరాజు, సింహాసనం, అగ్ని పర్వతం లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చెప్పాడు. రీసెంట్ గా 2022 నవంబర్ 15న ఆయన కన్నుమూశారు. ఇప్పుడు సూపర్ స్టార్ ట్యాగ్ ని ఆయన లెగసిని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు అభిమానులను అలరిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే31. ఆయన పుట్టినరోజు సందర్బంగా కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “మోసగాళ్లకు మోసగాడు” చిత్రాన్ని రీ రిలీజ్ అవుతుంది.

మోసగాళ్లకు మోసగాడు మూవీ కృష్ణ కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమా ఇండియా లో ఫస్ట్ కౌ బాయ్ మూవీ గా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. 1971 లో విడుదలైన ఈ చిత్రానికి KSR దాస్ దర్శకత్వం వహించగా కృష్ణ సొంత బ్యానర్ అయిన పద్మాలయ ఫిలిమ్స్ లో సోదరులు ఆదిశేషగిరి రావు నిర్మించారు. ఈ సినిమా లో విజయ నిర్మల హీరోయిన్ గా నటించింది. మోసగాళ్లకు మోసగాడు ఆరోజుల్లోనే 50 కి పైగా దేశాల్లో ప్రదర్షింపబడి రికార్డు సృష్టించింది.

ఇప్పుడు ఈ సినిమా మే 31న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ మీటింగ్ లో మోసగాళ్లకు మోసగాడు చిత్ర నిర్మాత, ఇంకా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు అయిన పి.ఆదిశేషగిరిరావు, నిర్మాత అశ్వినీదత్, దర్శకులు బి. గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు