Mahesh Babu : మనుష్యులందు నీ కథ మహర్షిలాగ సాగదా

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. మహర్షి సినిమాలో చెప్పినట్టు “మనుష్యులందు నీ కథ మహర్షిలాగ సాగదా.?” అనే లైన్ కి సరైన నిర్వచనం అని చెప్పొచ్చు.కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అని చెప్పడానికి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి.ఇక ఇప్పటికే 1000కి మందికి పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచాడు మహేష్. గాయం విలువ తెలిసినోడే సాయం చేస్తాడు అని చెప్పినట్లు తన కుటుంబంలో గౌతమ్ కి వచ్చిన సమస్య మరెవరికి రాకూడదు అని,తమ అభిమానులు కూడా ఎవరైనా కష్టాల్లో ఉంటే మహేష్ ముందుకు వచ్చి మరి ఆదుకుంటాడు.

Superstar Mahesh Babu who once again showed his humanity

ఇక రీసెంట్ గా మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మోపిదేవి పెదప్రోలులో కాకర్లమూడి రాజేష్ అనే వ్యక్తి మహేష్ బాబుకి వీరాభిమాని. అతనికి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. తన కొడుకులుకు మహేష్ బాబు సినిమాల పేర్లు పెట్టాడు. రాజేష్ మొదటి కొడుకు పేరు అర్జున్, రెండో కొడుకు పేరు అతిధి, మూడో కొడుకు పేరు ఆగడు అని పెట్టాడు అంటే మహేష్ పైన ఎంత అభిమానం ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

ఇక ప్రస్తుతం రాజేష్ ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్ అయి చావు బతుకుల మధ్య ఉన్నాడు. పేద కుటుంబం కావడంతో పిల్లలు చదువు మానేసి పనులు చేయాల్సిన స్థితి ఏర్పడింది. పెద్ద కొడుకు చెప్పుల షాప్ లో పని చేస్తున్నాడు. ఈ విషయం మహేష్ బాబు వద్దకు చేరడంతో మహేష్ బాబు ఫౌండేషన్ టీమ్ పెదప్రోలుకు వెళ్లి రాజేష్ పిల్లలు అతిధి, ఆగడులను మోపిదేవిలోని ఓ స్కూల్ లో జాయిన్ చేయించి డబ్బులు కట్టారు. ప్రతి సంవత్సరం మహేష్ నుంచే డబ్బులు వస్తాయని, వాళ్ళని చదివిస్తామని చెప్పినట్టు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు