Rajinikanth : సూపర్ స్టార్ కు గోల్డెన్ వీసా.. ఏ కంట్రీ అంటే!

Rajinikanth : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ జైలర్ బ్లాక్ బస్టర్ తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన ఈ రజిని, ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహం తో వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక గోల్డెన్ ఛాన్స్ ని కొట్టేశారు.
అయితే ఆ విశేషం సినిమానో, లేక ఇంకేదైనా ఫ్యామిలీ విశేషమో కాదు. అసలు విషయమేమిటంటే.. ప్రముఖ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కంట్రీ తరపున గోల్డెన్ వీసాను సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా అందుకున్నారు. దీంతో ఆయన ఈ వీసాను అందుకున్నవారి అతి కొద్దీ మంది సినీ ప్రముఖుల జాబితాలోకి చేరారు. ఇక ఈ విషయాన్ని రజినీకాంత్ ఆయన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన (Rajinikanth) మాట్లాడుతూ.. యూఏఈ (UAE) నుండి గోల్డెన్ వీసాను తనకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని రజినీకాంత్ అన్నారు.

Superstar Rajinikanth got UAE Golden Visa

స్నేహితుడికి స్పెషల్ థ్యాంక్స్..

ఇక రజినీకాంత్ కి యూఏఈ గోల్డెన్ వీసా రావడం వెనుక తన స్నేహితుడు అయిన లుల్లూ గ్రూప్ చైర్మేన్ & మేనేజింగ్ డైరెక్టర్ అయిన యూసఫ్ అలీ కారణం అని తెలిసింది. ఇక ఈ సందర్బంగా వీడియో లో స్పెషల్ గా రజినీకాంత్ యూఏఈ ప్రభుత్వానికి, అలాగే తన స్నేహితుడైన యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆతను లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు. అయితే ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులకు యూఏఈ ఈ ప్రత్యేక వీసా అయినటువంటి గోల్డెన్ వీసాను అందజేస్తోంది. ఈ వీసాను 10 ఏళ్ల కాలపరిమితితో అందజేస్తుంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఈ గోల్డెన్ వీసాను అందించింది.

- Advertisement -

గోల్డెన్ వీసా అందుకున్న సినీ ప్రముఖులు…

ఇక గోల్డెన్ వీసా రజినీకాంత్ కే గాక ఇంతకు ముందు పలు ప్రఖ్యాతి గాంచిన స్టార్లకు ఈ వీసా రావడం జరిగింది. ఇక టాలీవుడ్ నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అలాగే మలయాళం స్టార్స్ మమ్మూట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్ తో పాటు త్రిష, అమలాపాల్, టొవినో థామస్, ఇక బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ లకు ఈ వీసా లభించడం జరిగింది. ఇక రజినీకాంత్ (Rajinikanth) సినిమాల విషయానికి వస్తే.. లాస్ట్ ఇయర్ ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్ ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే ప్రస్తుతం ప్రస్తుతం ‘వేట్టయాన్’ మూవీలో ఆయన నటిస్తున్నారు. ఆయనకు ఇది 170వ చిత్రం. అది పూర్తవగానే ‘కూలీ’ సినిమాతో బిజీ అవనున్నాడు. మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా చేస్తుండగా, ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే అవి మొదలుపెడతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు