Supritha Naidu: ఈ అరాచకం ఏందీ భయ్యా.. మొత్తం చూపిస్తే అది రావడం కష్టమే..

Supritha Naidu: ఒకప్పుడు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకొని నిలబడాలి అంటే టాలెంట్ ఉండాలి. అలానే ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్ ఇవ్వాలి. ఆడిషన్ లో ప్రూవ్ అయిన తర్వాత అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో అలా కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారు ఎవరికీ అర్థం కాకుండా పోతుంది. ఏదో ఒక పని చేసి ఫేమస్ అవ్వడం, తర్వాత టీవీలో కనిపించడం, ఆ తర్వాత సినిమాల్లో కూడా కనిపించడం ప్యాషన్ అయిపోయింది.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతోమంది మంచి పేర్లును సాధించుకున్నారు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన వారిలో సురేఖ వాణి ఒకరు. సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మామూలు టీవీ ఛానల్ లో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈవిడ చిన్నగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో పాత్రలు వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం సురేఖ వాణి సినిమాల్లో కాకుండా ఎక్కువగా ఇంస్టాగ్రామ్ లో దర్శనమిస్తూ ఉంటుంది. ఈమెకి సుప్రీత అని ఒక కూతురు కూడా ఉంది. ఇంస్టాగ్రామ్ ఎక్కువగా వాడే వారికి సుప్రీతా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ పాప. అయితే చిన్నగా సినిమాల్లో కూడా వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈమెకి సరైన అవకాశాలు దక్కట్లేదు. దీని కారణం ఈమె ఇంస్టాగ్రామ్ లో చేసే హడావిడి అని చెప్పొచ్చు.

- Advertisement -

Supritha Naidu

కేవలం ఎక్స్పోజింగ్ తో అవకాశాలు వచ్చేస్తాయి అని కొందరు అనుకుంటారు. అదే మాదిరిగా ఏ సినిమాలు చేయకుండానే ఇంస్టాగ్రామ్ వేదికగా ఎక్స్పోజింగ్ చేస్తుంది ఈ ఆర్టిస్ట్ కూతురు. ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తుంది. ఇది కేవలం సోషల్ మీడియాలో కామెంట్స్ మాత్రమే పరిమితం అవుతుంది తప్ప సినిమాల్లో అవకాశాన్ని మాత్రం తీసుకురావట్లేదు. అయితే కొంతమంది మాత్రం దారుణంగా ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. అన్ని చూపిస్తే సినిమాల్లోకి తీసుకోరు అంటూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు