Tollywood: ఆ హీరోలతో సురేఖ వాణి కి డేటింగ్ కి వెళ్లాలని ఉందట

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్లతో సమానంగా క్రేజ్ సంపాదించింది. ఈమెతో పాటు ఇప్పుడు ఆమె కూతురు సుప్రీత కూడా ఇదే బాటలో పయనిస్తుంది. చిన్న వయసు నుంచి ఈ అమ్మడు తనదైన టాలెంట్ ని చూపిస్తూ సత్తా చాటుతుంది. ముఖ్యంగా యూట్యూబర్ గా ఈ చిన్నది యమ పాపులర్ అయిపోయింది. ఇక దాదాపు ఏడాదికి 20 సినిమాలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్ ను లీడ్ చేసింది సురేఖ వాణి. కానీ ఆ తర్వాత తన భర్త మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లి.. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. కాగా ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆక్టివ్ అయ్యింది. ఈ మధ్యకాలంలో సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తన కూతురితో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.

 

అయితే తాజాగా తన కూతురు సుప్రీత తో కలిసి సురేఖ వాణి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా వీరిద్దరూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో సురేఖ వాణి కూతురు సుప్రీతను.. మీ అమ్మకు ఏ హీరో అంటే ఇష్టం, ఏ హీరోతో డేట్ కి వెళ్తుంది అని అడిగితే ఆలోచించకుండా టక్కున.. మా అమ్మకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని, కుదిరితే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ కి వెళుతుందని చెప్పింది. అంతేకాదు అక్కినేని నాగార్జున అంటే కూడా చాలా ఇష్టమని, ఆ హీరోతో కూడా డేటింగ్ కి వెళ్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక మీరు ఎవరికైనా 100 ముద్దులు ఇవ్వాల్సి వస్తే ఏ హీరోకి ఇస్తారు అని సురేఖ వాణిని అడిగితే.. వెంటనే పవన్ కళ్యాణ్ కి 100 ముద్దులు ఇస్తానంటూ మొహమాటం లేకుండా చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు