టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి తెలియని వారు ఉండరు. అక్కగా, వదినగా అనేక చిత్రాలలో నటించి సురేఖ వాణి అభిమానులను సంపాదించుకుంది. కేవలం ఎమోషనల్ పాత్రలలోనే కాకుండా బ్రహ్మానందంకు భార్యగా నటించి కామెడీని సైతం పండించింది. ఇక సురేఖవాణి సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో తన ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా షూటింగ్స్ స్పాట్ లలో ట్రెండింగ్ వీడియోలకు సురేఖ వాణి రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సురేఖ వాణి చేసిన ఓ రీల్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సురేఖ వాణి రాజకీయ నాయకురాలు షర్మిల ఓ వీడియో సమావేశంలో చెప్పిన డైలాగులు చెప్పింది.
షర్మిల ఓ మీడియా సమావేశంలో “నేను అనలేదు అయ్యా మీ దగ్గర వీడియో ఉంటే చూపించు చూపించు, నేను ఎందుకు అంటాను. నాకు ఆయన మగతనంతో సంబంధం ఏందయ్యా, నేను ఎందుకు అనాలి నేను ఎందుకు మాట్లాడాలి ఆయన, ఆయన భార్య చూసుకోవాలి కదా” అంటూ చెప్పిన డైలాగులు సురేఖ వాణి తన స్టైల్ లో చెప్పారు. కాగా సురేఖ వాణి చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సూపర్ మేడం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అచ్చం షర్మిలలానే కనిపిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గతంలోనూ సురేఖ వాణి ఇలాంటి వీడియోలు చేసిన సంగతి తెలిసిందే.