Surekhavani: 46 ఏళ్ల వయసులో షాకిచ్చేలా అతనితో సురేఖ వాణి..!

Surekhavani: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి సురేఖ వాణి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో అక్కగా, అత్తగా, వదినగా ,తల్లిగా నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సైతం నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన కూతురు సుప్రీతతో కలిసి చేసేటువంటి అల్లరి అంతా ఇంతా కాదు.. వీటన్నింటినీ చూస్తే అసలు వీరిద్దరూ తల్లి కూతుర్లేనా అనే అంతగా హంగామా చేస్తూ ఉంటారు.

కూతురుతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ..

గడిచిన కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సురేఖవాణి తన కూతురు సుప్రీతాను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం చాలా తాపత్రపడుతోంది. అలాగే బిగ్ బాస్ అమర్ దీప్ సరసన ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి షూటింగ్ అయితే జరుగుతోందట. సోషల్ మీడియాలో సురేఖ, సుప్రీత చేసే గ్లామర్ ఫోటోలు కూతుర్ని డామినేట్ చేస్తూ ఉంటుంది.. ఇప్పుడు తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు ఎక్కువగా ఒర్రీ తో దిగిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు.

బాలీవుడ్ ఒర్రీతో ఫోటోలు..

Surekhavani: Surekha Vani with him at the age of 46..!
Surekhavani: Surekha Vani with him at the age of 46..!

ఇప్పుడు తాజాగా సురేఖ వాణి కూడా అదే పని చేసింది పింక్ కలర్ దుస్తులను ధరించి.. తన ఎద అందాలను చూపిస్తూ ఒర్రీ నీ పట్టుకొని ఫోజిస్తూ స్మైల్ ఇస్తూ ఒక ఫోటోని షేర్ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ నటి అయినప్పటికీ సురేఖ వాణి ఫోటో పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టేలా చేసింది. ఎక్కువగా బాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలు మాత్రమే ఉన్నటువంటి పార్టీలో సురేఖవాణి ఎంట్రీ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఫోటో చూసిన వారందరూ కూడా బాలీవుడ్ పార్టీలలో సురేఖ వాణికి ఏం పని ఉంది అని అనుమానాలను కూడా వ్యక్తం చేసేలా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

46 ఏళ్ల వయసులో కూతురు కోసం అలాంటి పని..

మొత్తానికి సురేఖ వాణి తన 46 యేళ్ళ వయసులో ఇలాంటి ఫోటోతో షాక్ ఇచ్చిందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో తన కూతురుకు అవకాశాలు ఇవ్వాలని.. ఇలా అందరితో కలిసి పార్టీలలో కనిపిస్తోందనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సురేఖ వాణి మాత్రం చాలా స్పెషల్ గానే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. మొత్తానికైతే సురేఖ వాణి షేర్ చేసిన ఫోటో ఇప్పుడు పలు అనుమానాలకి కూడా తెర లేపుతోందని చెప్పవచ్చు. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి రాకముందే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న సుప్రీత ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెడితే మరి ఎలాంటి అవకాశాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు