Suresh Babu : రేట్లు పెంచడం కన్నా సినిమాని చూపించడం ముఖ్యమన్నాడు.. కట్ చేస్తే తన సినిమాకి చేసిందేంటో!

Suresh Babu : టాలీవుడ్ లో గత కొంత కాలం నుండి టికెట్ రేట్లపై రచ్చ నడుస్తోందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వం కొన్ని పెద్ద సినిమాలకు అన్యాయంగా టికెట్ రేట్లు తగ్గించడం టైం నుండి టికెట్ రేట్లపై రచ్చ మొదలైంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కూడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ నేపథ్యంలో తెలుగు సినిమాలకి ముఖ్యంగా పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి కొన్ని షరతుల మీద పర్మిషన్ ఇచ్చారు రెండు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు. ఇక రీసెంట్ గా టికెట్ రేట్లు పెంచడం వల్ల కల్కి2898AD సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలు వచ్చాయి. నిర్మాతలకు సగం లాభం తెలుగు రాష్ట్రాల నుండే వచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా టికెట్ రేట్లు పెంచడం పై తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఊహించని విధంగా స్పందించారు.

Suresh Babu Latest Comments About Movie Ticket Rates

టికెట్ రేట్లు పెంచడం కన్నా అందరికి సినిమా చూపించడం ముఖ్యం – సురేష్ బాబు

తాజాగా ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు (Suresh Babu) తిరుమల శ్రీవారిని దర్శించుకోగా అక్కడ ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర విషయాలపై మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా టికెట్ రేట్ల గురించి గవర్నమెంట్ వారి నుండి పెద్దగా ఏ సమస్యా లేదని. నిర్మాతలు ఏది కావాలంటే అది చేసేసుకోవచ్చని, దానికి సింపుల్ గా నిర్మాతలకు అనుకూలంగానే జి.ఓ చేస్తామని మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారని… అయితే టికెట్ రేట్స్ పెంచటం కన్నా, సినిమాను ప్రేక్షకులు అందరికి మనం అందుబాటులో పెట్టాలి, ఎక్కువమంది వచ్చి సినిమా చూస్తుండాలి. అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కట్ చేస్తే ఒక తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది.

- Advertisement -

భారతీయుడు2 కి హైక్.. లాభం ఎవరికో తెలుసా?

తాజాగా భారతీయుడు2 సినిమాకి టికెట్ హైక్ కోరుతూ తెలంగాణ గవర్నమెంట్ కి పర్మిషన్ కోరగా, తాజాగా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. 50 నుండి 75 రూపాయలు టికెట్ పై హైక్ ని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడే సూపర్ ట్విస్ట్ ఉంది. కట్ చేస్తే.. భారతీయుడు2 నైజాం రైట్స్ కొన్నది సురేష్ బాబేనట. తిరుమలలో టికెట్ రేట్లు పెంచడం కన్నా చూపించడం ముఖ్యమని చెప్పి… తాను కొన్న ఇండియన్2 సినిమాకి రేట్లు పెంచుకోవడం ఏంటో.. అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే… అన్నట్టు అందరు నిర్మాతలు ఇంతే అని ప్రాక్టికల్ గా సమర్థిస్తున్నారు. కానీ ఇండియన్2 పై ఆశించినంత బజ్ లేకపోవడం వల్ల అసలుకే ఎసరు పెట్టేలా ఓపెనింగ్స్ కూడా రాకపోవచ్చని అంటున్నారు కొందరు నెటిజన్లు. మరి రేపు విడుదల అవుతున్న భారతీయుడు2 ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు