Suriya: ఏకంగా 12 మంది హీరోలు చేజార్జుకున్నారు.. కట్ చేస్తే..!

Suriya.. సాధారణంగా ఒక కథను రాసేటప్పుడు దర్శక నిర్మాతలు ఆ హీరోలను దృష్టిలో పెట్టుకొని సినిమా కథ రాస్తూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కథలను రిజెక్ట్ చేస్తే, అవి కాస్త వేరొకరి దగ్గరకు వెళుతూ వుంటాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏకంగా 12 మంది హీరోలు చేజార్చుకున్న ఒక సినిమా కథను, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి ఆ సినిమా కథ ఏంటి? ఆ సినిమా కథను వదులుకున్న ఆ 12 మంది హీరోలు ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

Suriya: 12 heroes together miss the chance.. if cut..!
Suriya: 12 heroes together miss the chance.. if cut..!

గజినీ సినిమాని వదులుకున్న 12 మంది హీరోలు..

ఆ సినిమా ఏదో కాదు సూర్య నటించి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గజిని. మహేష్ బాబును మొదలుకొని అజిత్ , మాధవన్, విక్రమ్ , సల్మాన్ ఖాన్, విజయ్, రజినీకాంత్, వెంకటేష్, శింబు, అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, మోహన్ లాల్ ఇలా దాదాపు 12 మంది హీరోలు ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట. కానీ సూర్య మాత్రం ఈ సినిమాలో ఏదో ఉందని గ్రహించి, పాత్రకు తగ్గట్టుగా జీవించేశారు. ఏ. ఆర్. మురగదాస్ , సూర్య కాంబినేషన్లో వచ్చిన ఈ గజినీ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ సినిమా తమిళ్ భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా డబ్బింగ్ చేయబడి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తెలుగులో సూర్య మార్కెట్ డబుల్ చేసిన సినిమా కూడా ఇదే. మూవీ రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత హిందీలో కూడా రీమిక్స్ చేసి విడుదల చేశారు ఇందులో అమీర్ ఖాన్ హీరోగా నటించారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

రూ.7 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు..

గజినీ సినిమా తమిళ్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ఆసిన్ , సూర్య, ప్రదీప్ రావత్ తో పాటు నయనతార సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మెమొరీ పవర్ ను లాస్ అయిన సూర్య, నయనతార సహాయంతో తన ప్రేయసి అసిన్ ను హతమార్చిన హంతకులను కనుగొని ప్రతీకారం తీర్చుకోవడమే గజినీ కథ. కేవలం రూ .7 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్లో రూ.62 కోట్లు అలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు కాబట్టి ఎవర్గ్రీన్ చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ కూడా ఆడియన్స్ ఈ సినిమా బుల్లితెర చానల్లో వచ్చిందంటే చాలు టీవీకి అతుక్కుపోతూ ఉంటారు అంతలా ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సినిమా. అంతేకాదు సినిమాలలో ఒక కొత్త క్యారెక్టర్ ఇప్పటికీ ఆడియన్స్ను అలరిస్తోంది అంటే దానికి కారణం డైరెక్టర్ మురగదాస్ అని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ఇలాంటి ఆలోచనలు డైరెక్టర్లను ఎక్కడికో తీసుకెళ్తాయి అనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు