Suriya 44: కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ స్టైల్ లో క్రేజీ అప్డేట్

Suriya 44: షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు పెట్టిన కార్తీక్ సుబ్బరాజ్ పిజ్జా సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. సినిమాను చాలా డిఫరెంట్ గా తీశాడు. టెక్నికల్ గా కూడా చాలామందికి మంచి ఎక్స్పీరియన్స్ ను ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన జిగర్తాండ సినిమా ఒక సంచలనం. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అదే సినిమాను తెలుగులో గద్దల కొండ గణేష్ పేరుతో రీమిక్ చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని సాధించింది. వరుణ్ తేజ్ కెరియర్ లో ఒక సూపర్ హిట్ గా నిలిచింది.

పెట్ట తో పీక్

ఇకపోతే కార్తీక్ కెరియర్ లో ఉన్న సూపర్ హిట్ సినిమాలలో పెట్ట సినిమా కూడా ఒకటి అని చెప్పొచ్చు. రజనీకాంత్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ని వసూలు చేసింది. రజనీకాంత్ అభిమానులకి ఒక విజువల్ ట్రీట్ లా అనిపించింది. ఈ సినిమాలో రజనీకాంత్ ను చూపించిన విధానం ఆ స్టైల్ ఆ స్వాగ్ అన్ని కూడా ఆడియన్స్ ను కట్టిపడేసాయి. వీటన్నిటిని మించి సినిమాకి అనిరుద్ అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. అద్భుతమైన సంగీతాన్ని అందించడంతోపాటు భీభత్సమైన బ్యాక్ గ్రౌండ్స్ కోసం కూడా యాడ్ చేశాడు.

Suriya 44: Karthik Subbaraj

- Advertisement -

సూర్య సినిమా అప్డేట్

కార్తీక్ తన కెరియర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశాడు. టెక్నికల్ గా కూడా ఆ సినిమాలు మంచి బ్రిలియంట్ గా అనిపించాయి. ఇకపోతే ధనుష్ విక్రమ్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేశాడు. విక్రమ్ ధృవ్ ను కలిపి మహాన్ అనే సినిమాను చేశాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక ప్రస్తుతం కార్తీక్ సూర్యతో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య నటిస్తున్న 44వ సినిమా ఇది. ఈ సినిమాలో సూర్య సరసన కథానాయికగా పూజ హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిన్ననే మొదలైనట్లు అఫీషియల్ గా వీడియోని రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ చేసిన వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పొచ్చు. సముద్రపు ఒడ్డున కూర్చున్న సూర్య ని చాలా ఇంటెన్స్ గా చూపించి సినిమా పైన ఇంట్రెస్ట్ ను రేకెత్తించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు