Kanguva Fire Song : ఫైర్ అంటే ఈ రేంజ్ ఫైర్ అనుకోలేదు భయ్యా.. ఒక్కో సీన్ పీక్స్..

Kanguva : తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ జోష్ తో దూసుకుపోతున్నాడు.. ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.. ఇక్కడ కూడా ఆయనకు ఫాలోలవర్స్ ఉన్నారు.. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. ప్రస్తుతం కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఫైర్ అంటూ వచ్చిన ఈ సాంగ్ నెట్టింట మంటలు పుట్టిస్తుంది..

ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఈ సినిమాలోని మొదటి పాటను తమిళ్ వర్షన్ లో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు.. ఆ పాట అన్న విధంగానే ఫైర్ పుట్టించింది.. దాంట్లో సూర్య ఎక్ప్రెషన్స్ మైండ్ బ్లాక్.. ఒక్కమాటలో చెప్పాలంటే కిల్లింగ్ అనే చెప్పాలి.. మొత్తానికి పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ అత్యంత భారీ యుద్ధానికి సంబంధించిన సీన్ తీసినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. గతంలో చాలా అప్డేట్స్ ఆ సీన్స్ గురించి చెప్పాయి.. ఇకపోతే టీజర్ అసలు సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. ఇందులో సూర్య, బాబీ డియోల్ ఒకరికొకరు ఎదురుపడటం చూడొచ్చు. ఇప్పటివరకు సూర్యను ఇలా ఎప్పుడు చూడలేదు .. డైరెక్టర్ ప్రేక్షకులను కొత్తగా చూపించాడు. మొత్తానికి సాంగ్ అద్భుతంగా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక సినిమా త్వరలో విడుదల కాబోతుంది.. టాలీవుడ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా కమ్ బ్యాక్ అనే చెప్పాలి.. ఈ సినిమా ఈ ఏడాది ఏకంగా పది భాషల్లో రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. 3డీ ఫార్మాట్లోనూ సినిమా రానుంది.. ఈ సినిమా విడుదల తేదీ పై అధికార ప్రకటన అయితే రాలేదు కానీ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. కంగువ తర్వాత సూర్య 43 సినిమాను సుధా కొంగర దర్శకత్వంలో రాబోతుంది.. ఆ తర్వాతసూర్య ‘పురాణనూరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పై త్వరలోనే మరో అప్డేట్ రానుందని సమాచారం..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు