Suriya : నెక్స్ట్ ప్రాజెక్ట్ పై స్పీడు పెంచిన సూర్య.. అంటే ఆ సినిమా పూర్తయినట్టేనా?

Suriya : కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రెండేళ్ల కింద ET సినిమాతో ప్రేక్షకులని పలకరించిన సూర్య ఇప్పటివరకూ వేరే సినిమాతో రాలేదు. మధ్యలో విక్రమ్ లో రోలెక్స్ గా ఫ్యాన్స్ ని ఖుషి చేసినా, ఇంకా వేరే సినిమా ఏది రాలేదు. అందుకే సూర్య ఫ్యాన్స్ చాలా ఆకలి మీదున్నారు. అందుకే సూర్య కూడా బాగా లేట్ అయిందని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లను వీలైనంత తొందరగా ఫినిష్ చేసి, గ్యాప్ ని కవర్ చేద్దామని చూస్తున్నాడు. పైగా కోలీవుడ్ లో ఇతర హీరోల అభిమానులు ఆయా హీరోల నుండి వరుస సినిమాలు రావడంతో ఖుషీగా ఉన్నారు. ఎటొచ్చి సూర్య అభిమానులే రెండేళ్ల బట్టి ఓపికతో ఉన్నారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సూర్య తన నెక్ట్ సినిమాపై అప్పుడే ఫోకస్ పెట్టేసాడు. ప్రస్తుతం సూర్య కార్తీక్ సుబ్బరాజ్ తో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సెట్స్ లోకి సూర్య అడుగుపెట్టాడు.

Suriya - Karthik Subbaraj Movie latest update

కార్తీక్ సుబ్బరాజ్ తో సూర్య జెట్ స్పీడ్…

ఇక సూర్య (Suriya) హీరోగా నటిస్తున్న తన 44వ చిత్రం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ అయి చాలా రోజులే అవగా, తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసారు. అయితే మొదటి షెడ్యూల్ ఇక్కడే చెన్నైలో, లేదా హైదరాబాద్ లో జరుగుతుందనుకున్నారు అందరూ. కానీ ఫస్ట్ షెడ్యూల్ ని ఏకంగా అండ‌మాన్ నికోబార్ దీవుల్లో స్టార్ట్ చేసాడు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ లో అక్క‌డ సూర్య – పూజాహెగ్డేపై కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. అలాగే రెండు సాంగ్స్ కూడా అక్కడే షూట్ చేస్తున్నారని సమాచారం. ఇంకా సూర్య‌పై కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా సైలిష్ గా తెరకెక్కస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం సూర్య, పూజాహెగ్డే సహా ప్రధాన తారాగణం అండమాన్ దీవుల్లోనే ఉండగా, ఓ మూడు లేదా నాలుగు రోజుల్లో షెడ్యూల్ పూర్తయిపోతుందని సమాచారం.

- Advertisement -

కంగువ ఫినిష్ అయినట్టేనా?

ఇక సూర్య కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అండమాన్ లో షూట్ పూర్తి కాగానే, రెండో షెడ్యూల్ ఊటీలో ప్లాన్ చేస్తున్నారట. పాగా ఇది నెలరోజుల లాంగ్ షెడ్యూల్ అట. యాక్షన్ & లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ సినిమా రెగ్యులర్ షూట్ నాన్ స్టాప్ గా తెరక్కిస్తుండడంతో నెటిజన్ల నుండి కొత్త ప్రశ్న ఎదురౌతుంది. సూర్య దీనికంటే ముందుగా డైరెక్టర్ శివ తో “కంగువ” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. అయితే కార్తీక్ సుబ్బరాజుతో సూర్య నాన్ స్టాప్ సినిమా చేస్తుండడం పట్ల కంగువ సినిమా మొత్తం షూటింగ్ పూరయినట్టేనా అన్న డౌట్స్ వస్తున్నాయి. అయితే అందిన సమాచారం ప్రకారం సూర్య కంగువ కి సంబంధించి తనవరకూ మొత్తం సినిమాని పూర్తి చేశారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే దానికి మిగిలి ఉన్నాయట. అందుకే సూర్య వేరే ప్రాజెక్ట్ మొదలు పెట్టాడని సమాచారం. ఇక కంగువ జులై నుండి ప్రమోషన్లు మొదలుపెడుతుండగా, అక్టోబర్ 10న రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు