Suriya : అదిరిపోయిన సూర్య డిఫరెంట్ మేకోవర్.. ఆ సినిమా కోసమే!

Suriya : కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రెండేళ్ల కింద ET సినిమాతో ప్రేక్షకులని పలకరించిన సూర్య మళ్ళీ వేరే సినిమాతో రాలేదు. మధ్యలో విక్రమ్ లో రోలెక్స్ గా ఫ్యాన్స్ ని ఖుషి చేసినా, అది ఐదు నిమిషాల రోల్. ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ చాలా ఆకలి మీదున్నారు. అందుకే సూర్య కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లను వీలైనంత తొందరగా ఫినిష్ చేసి, గ్యాప్ ని కవర్ చేద్దామని చూస్తున్నాడు. ఇక రెండేళ్ల పాటు తాను నటిస్తున్న కంగువ సినిమాపైనే దృష్టి పెట్టిన సూర్య, తాజాగా తన నెక్ట్ సినిమాపై అప్పుడే ఫోకస్ పెట్టేసాడని తెలుస్తుంది. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో కంగువ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయిపోయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేయగా, త్వరలో ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ తర్వాత సూర్య కార్తీక్ సుబ్బరాజ్ తో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Suriya Sivakumar's different makeover looks is going viral

వైరల్ అవుతున్న సూర్య మేకోవర్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమేగా!

తాజాగా సూర్య (Suriya) కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్న తన 44వ సినిమా షూటింగ్ సెట్స్ లోకి సూర్య అడుగుపెట్టాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ అయి చాలా రోజులే అవగా, రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసారు. అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఫస్ట్ షెడ్యూల్ చేసిన డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు నెక్స్ట్ షెడ్యూల్ జులై మూడోవారంలో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సూర్య స్టన్నింగ్ మేకోవర్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. తాజాగా ముంబైలో అక్షయ్ కుమార్ నటించిన “సర్ఫిరా” సినిమా స్పెషల్ ప్రీమియర్స్ కి సూర్య జ్యోతిక తో కలిసి రావడం జరిగింది. అక్కడ సూర్య డిఫరెంట్ మేకోవర్ లుక్ తెగ వైరల్ అవుతుంది. చాలా రోజుల తర్వాత సూర్య సింగం మాదిరిగా మీసాలు పెంచి, లైట్ గా గడ్డం కూడా పెట్టి స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. ఈ మేకోవర్ కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కోసమే అని తెలిసిపోతుంది.

- Advertisement -

సూర్య ఆకాశమే హద్దురా రీమేక్ “సర్ఫిరా”..

ఇదిలా ఉండగా సూర్య లేటెస్ట్ గా ‘సర్ఫిరా’ సినిమా ప్రీమియర్స్ కి వెళ్లగా, ఆ సినిమాలో అక్షయ్ కుమార్ నటించగా, సుధా కొంగర ఆ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇక ఈ సినిమా సూర్య నటించిన ఆకాశమే హద్దురా సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. మరి నాలుగేళ్ళ తర్వాత రీమేక్ చేసిన అక్షయ్ కుమార్ సూర్య స్థాయిలో ఆకట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఇక సూర్య నటించిన “కంగువ” మూవీ ప్రమోషన్లు ఈ మంత్ ఎండింగ్ లో మొదలుపెడుతుండగా, భారీ అంచనాలతో అక్టోబర్ 10న రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు