Project K : సర్ప్రైజ్ అప్డేట్

అందరి చూపులు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపైనే ఉన్నాయి. రాధేశ్యామ్ తర్వాత వస్తున్న సినిమాలు అన్ని కూడా భారీ బడ్జెట్ తోనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రాజెక్ట్ కె పై డార్లింగ్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం వస్తుంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని రూ. 500 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునె కథనాయకిగా నటిస్తుంది. అలాగే అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో చేస్తున్నారు.

ఈ చిత్రం అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజుల అవుతుంది. కానీ ఇప్పటి వరకు పోస్టర్లు, స్టోరీ, ఇతర నటీనటుల గురించి చిన్న వార్త కూడా వినిపించలేదు. ముఖ్యంగా ప్రాజెక్ట్ కె లో కె అంటే అర్థం ఏంటి అని చాలా మంది డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అలాగే కొన్ని రోజుల నుండి ఈ చిత్రం టైమ్ ట్రావెల్ కు చెందినది అంటూ పుకార్లు కూడా వచ్చాయి. కానీ దానిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.

ఇది ఇలా ఉండగా.. వినాయక చవతి సందర్బంగా ప్రాజెక్ట్ కె చిత్ర యూనిట్ సెట్స్ లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాని ముందు ఒక పేపర్ పై ‘ఒకప్పుడు వేద వ్యాసునికి మహా భారతం రాయడానికి సహాయం చేశావు. ఇప్పుడు మా భారతాన్ని కూడా మీరే ఆశీర్వదించాలి విజ్ఞేశ్వర’ అని రాశారు. దీంతో ప్రాజెక్ట్ కె చిత్రం మహా భారతానికి సంబంధించినది అనే అభిప్రాయం వస్తుంది. ఈ పోస్టుతో చిత్ర యూనిట్ చిన్న క్లూ ఇచ్చిందని కూడా డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు