Surya – Karthi : కేరళ బాధితులను ఆదుకున్న కార్తీ, సూర్య – జ్యోతిక..

Surya – Karthi : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సూర్య తన సినిమాలతో అలరించడమే కాకుండా, ఎన్నో సందర్భాల్లో ఛారిటీల ద్వారా ఎంతో మందికి సాయం చేశారు. ఎంతో మంది అభిమానులనే కాదు, సామాన్య ప్రజలని కూడా కష్టాలు వచ్చిన సమయంలో చేయూతనిచ్చిన సందర్భాలున్నాయి. ఆ మధ్య తమిళనాడు లో ఓ ప్రమాదం పై ప్రభుత్వ బాధ్యతని గుర్తుచేసిన వాళ్లలో సూర్య ముందు నిలిచాడు. అలాగే సూర్య తమ్ముడు కార్తీ కూడా ఎన్నో సందర్భాల్లో అన్న కి తగ్గ తమ్ముడుగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా, పలు సందర్భాల్లో ఎంతో మందిని ఆదుకున్నాడు.

Surya -Jyothika - Karthi help for Wayanad victims

కేరళ బాధితుల్ని ఆదుకున్న బ్రదర్స్..

ఇదిలా ఉండగా కేరళలో వాయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక గ్రామం పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఎన్నడూ లేనంత భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడటంతో పాటు పెద్ద స్థాయిలో బురద గ్రామంలోకి వచ్చి ప్రజలని ముంచేసింది. ఇక ఈ ప్రమాదంలో దాదాపు 250 మందికి పైగా ప్రజలు మృతి చెందారని సమాచారం. ఇప్పటికీ కొన్ని వందల మంది ప్రజలు అక్కడ గల్లంతయ్యారు. NDRF, ఇండియన్ ఆర్మీ, ఫైర్ సిబ్బంది ఇప్పటికే అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేప్పట్టారు. ఇక ఈ ప్రకృతి విపత్తులో వేలమంది ప్రజలు పూర్తిగా నిరాశ్రయులుగా మారారు. ఇక వీరిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. అలాగే ఇప్పటికే పలువురు ప్రముఖుల నుండి విరాళాలు వచ్చాయి. కాగా తాజాగా తమిళ ఇండస్ట్రీ నుండి కోలీవుడ్ స్టార్ సూర్య – జ్యోతిక, అలాగే కార్తీ (Surya – Karthi) కేరళ బాధితులకు తమ విరాళం ప్రకటించారు.

- Advertisement -

సూర్య – జ్యోతిక, కార్తీ తక్షణ సాయం..

ఇక కేరళ లో వాయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తుకు కోలీవుడ్ స్టార్ సూర్య అలాగే తన భార్య జ్యోతిక , ఇంకా సూర్య తమ్ముడు కార్తీ చెరో 50 లక్షల చొప్పున భారీ విరాళం ప్రకటించాడు. తమిళ ఇండస్ట్రీ నుండి వీరే ముందుగా సాయం ప్రకటించి ముందుకొచ్చారు. ఇక తమిళ నాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి సూర్య, జ్యోతిక, కార్తీ తమ విరాళాన్ని అందించడం జరిగింది. ఇక కేరళ మృతుల కుటుంబాలకి సూర్య ఫ్యామిలీ తమ సానుభూతి తెలియజేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు