Surya Prakash: సినీ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ మృతి..!

Surya Prakash..ఇటీవల ప్రముఖ నటుడు చందు మరణ వార్త మరువకముందే ఇప్పుడు తాజాగా మరొకసారి ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్లలో సూర్య ప్రకాష్ కూడా ఒకరు.. ఎన్నో చిత్రాలను సైతం తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున సూర్యప్రకాష్ గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.. దీంతో ఒకసారిగా తమిళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. డైరెక్టర్ సూర్య ప్రకాష్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

డైరెక్టర్ సూర్య ప్రకాష్ కెరియర్..

Surya Prakash: Tragedy in the film industry.. Director's death..!
Surya Prakash: Tragedy in the film industry.. Director’s death..!

మొట్టమొదటిసారిగా 1996 లో మాణిక్కం అనే చిత్రం ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇందులో రాజ్ కుమార్, వనిత విజయ్ కుమార్ కూడా నటించారు. మై, దివాన్ వంటి చిత్రాలకు కూడా డైరెక్టర్ గా పనిచేశారు. ఈయన మరణ వార్త విని పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. నటుడు, రాజకీయ నాయకుడు అయినటువంటి శరత్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా నుంచి ఇలా రాసుకొస్తూ.. నా పాత్రలో మై దివాన్ చిత్రాలకు డైరెక్టర్గా వహించిన నా మిత్రుడు సూర్య ప్రకాష్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున మరణించారనే వార్త విని నేను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.. ఈ విషయం వినడం చాలా బాధాకరం అనిపించింది అంటూ తెలియజేశారు.

తెలుగులో దర్శకత్వం వహించింది ఆ ఒక్కటే..

2002లో రాజశేఖర్, సాక్షి శివానంద్ జంటగా నటించిన భరత సింహారెడ్డి సినిమాని కూడా తెలుగులో తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ తర్వాత మరే సినిమాని కూడా ఈయన తెలుగులో తెరకెక్కించలేదు. అయితే తన కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడం జరిగినప్పటికీ అవి విఫలమయ్యాయి.. ఇక తర్వాత సూర్యప్రకాష్ భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడానికి ఆఫర్లను పొందడంలో విఫలమయ్యాడు డైరెక్టర్ సూర్య ప్రకాష్ 2010లో విలేజ్ సెంట్రిక్ రొమాన్స్ చిత్రం వరుసనాడు లో పనిచేశాడు ఈ చిత్రం తన కజిన్ యొక్క నిజ జీవిత ప్రేమ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో కొత్తవారు కుమారుణ్ అలాగే సృష్టి డాంగే నటించారు. ఈ సినిమా ఇంకా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది .2014లో జీవన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ అధిబార్ చిత్రాన్ని కూడా ప్రారంభించారు. కానీ ఏ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ఇలా కొన్ని సినిమాలను మధ్యలోనే ఆపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

- Advertisement -

విడుదలకు నోచుకోని చిత్రాలు..

ఇక ఈ సినిమాల తర్వాత ఆయన మరే సినిమా కూడా తెరకెక్కించలేదు. ఇక దాంతో సినీ ఇండస్ట్రీకి కనుమరుగయ్యారంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆయన మరణం సినీ ఇండస్ట్రీని కలచి వేస్తోంది. ఇక ఈయన మరణం పై అటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు అలాగే అభిమానులు నిటిజన్లు కూడా ఓం శాంతి అంటూ కామెంట్లు పెడుతూ తమ సంతాపం తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు