Surya: ఇది మాములు రెస్పాన్స్ కాదు , కొంచెం వర్కౌట్ అయిన బ్లాక్ బస్టర్ ఖాయం

Surya: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న సంచలనమైన దర్శకులలో కార్తీక్ సుబ్బరాజు ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పిజ్జా అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. పిజ్జా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఆ సినిమాను తెరకెక్కించాడు కార్తీక్ సుబ్బరాజ్. విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి ఆదరణను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన సినిమా జిగర్తాండ.

జిగర్తాండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రిలీజ్ అయిన దాదాపు రెండేళ్ల తర్వాత హరీష్ శంకర్ తెలుగులో గద్దల కొండ గణేష్ పేరుతో రీమేక్ చేశాడు. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ ఫిలిం గా నిలిచిపోయింది. ఒక గ్యాంగ్స్టర్ కి సినిమా దర్శకుడు కి మధ్య జరిగే ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా డిఫరెంట్ గా చూపించాడు కార్తీక్ సుబ్బరాజు. అయితే కార్తీక్ సుబ్బరాజ్ ఎంత గొప్ప డైరెక్టర్ అని ఇదివరకే ప్రూవ్ అయింది. తనకు నచ్చిన కథలను తనకు నచ్చిన విధంగా చూపించడంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాడు కార్తీక్.

Suriya44

- Advertisement -

ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ సూర్యతో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ మొదటిసారి కలిసి పని చేస్తున్నారు. ప్రతి హీరోని ఎలా చూపించాలో బాగా తెలుసు కార్తీక్ సుబ్బరాజ్ తన టేకింగ్ కూడా ఒక మూస దోరణిలో కాకుండా అద్భుతంగా ఉంటుంది. ఇక రీసెంట్ గా సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ వీడియోలో కూడా సూర్య అని చాలా పవర్ ఫుల్ గా చూపించాడు కార్తీక్. ఆ వీడియోలో సూర్య స్వాగ్ మంచి కిక్ ఇస్తుంది. ఇప్పటికే ఈ వీడియోకి 65 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. సినిమా కొంచెం వర్క్ అవుట్ అయినా కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు