Suryakantham: అందుకే అమ్మ చనిపోయింది.. గయ్యాళి అత్త కొడుకు కామెంట్స్ వైరల్..!

Suryakantham.. సూర్యకాంతం.. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ నటీమణిగా పేరు సొంతం చేసుకోవడమే కాదు ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన వ్యక్తిగా కూడా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా అప్పట్లో ఈమె కట్టినంత ఖరీదైన చీరలు మరే స్టార్ హీరోయిన్ కూడా కట్టలేదంటే అప్పట్లో ఈమె రేంజ్ ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గయ్యాళి అత్త పాత్రలకు పెట్టింది పేరు. బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల నుంచే అందరికీ పరిచయం ఈమె.. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ మెస్మరైజ్ చేస్తూ ఉండేది. సూర్యకాంతం సినిమాలో గయ్యాళి అత్త క్యారెక్టర్లలో నటించినప్పటికీ నిజజీవితంలో మాత్రం ఆమె మనసు వెన్న. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాంటి ఈమె గురించి తాజాగా ఆమె కొడుకు ప్రముఖ డాక్టర్ అనంత పద్మనాభ మూర్తి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలు పంచుకున్నారు.

Suryakantham: That's why mom died.. Gaiyali's aunt's son's comments went viral..!
Suryakantham: That’s why mom died.. Gaiyali’s aunt’s son’s comments went viral..!

అమ్మ గయ్యాలి కాదు.. అనురాగ దేవత..

తాజాగా అనంత పద్మనాభ మూర్తి మాట్లాడుతూ.. మా అమ్మ గయ్యాలి కాదు.. అనురాగ దేవత. నా భార్యను సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేది. పనిమనిషి ఉన్నప్పటికీ కూడా అమ్మే వంట చేసి మాకు వడ్డించేది. అమ్మ కొన్ని విషయాలలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ముఖ్యంగా చదువుకునే సమయంలో చదువుకోవాలని, ఖాళీ సమయంలోనే ఆటలు ఆడుకోవాలని చెప్పేది. నాన్న లాయరు, అమ్మకు ఎప్పుడూ ఆయన ఆంక్షలు పెట్టలేదు. ముఖ్యంగా మహానటి సావిత్రి అంటే అమ్మకు ఎంతో ఇష్టం తనకు ఎంతో సహాయం కూడా చేసింది. అమ్మ చేతిలో దెబ్బలు తినని ఏకైక హీరోయిన్ జమున మాత్రమే. ఆమె ఎప్పుడూ కూడా ఆమెకు కూతురుగానే నటించేది ముఖ్యంగా గొప్ప గొప్ప నటీమణులంతా కూడా ఆమె చేతిలో దెబ్బలు తిన్నవారే. అలాంటి అమ్మ ఒక్కసారిగా మరణించేసరికి మాకు ఏడాది పాటు పిచ్చి పట్టినట్లు అయింది ఆమె డయాబెటిక్, కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ఆమె చనిపోయింది. లేకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలు బతికుండేదేమో.

అమ్మలేని లోటు తీర్చలేరు.

అమ్మకు నెయ్యి అంటే చాలా ఇష్టం లేదు. అలాగే ఫ్రై చేసిన పదార్థాలు అన్నా కూడా ఎంతో ఇష్టం. ఆహారం దగ్గర ఎటువంటి నియంత్రణ పాటించేది కాదు డయాబెటిస్ రావడంతో అమ్మకు డయాలసిస్ కూడా చేయించుకుంది. అదే సమయంలో గుండె సమస్య కూడా రావడంతో ఐసీయూలో అమ్మని చేర్చారు. దాదాపు 12 రోజుల పాటు అమ్మ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూనే స్వర్గస్తురాలు అయ్యింది.ఆమె మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కలచివేసింది. ముఖ్యంగా మా జీవితంలో చీకటి అలుముకుంది. అమ్మ మరణాన్ని మేము ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాము అంటూ ఎమోషనల్ అవుతూ సూర్యకాంతం కొడుకు పద్మనాభమూర్తి కామెంట్లు చేశారు. ప్రస్తుతం పద్మనాభమూర్తి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఎన్నో చిత్రాలలో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు సూర్యకాంతం. ఇక ఆమె లేని లోటును ఎప్పుడు ఎవరు తీర్చలేరనటంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు