Surya’s Kanguva: ఫైర్ సాంగ్ లో ఫైర్ కనిపించింది, ఇదే దేవి నుంచి కోరుకుంది

Surya’s Kanguva: ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఈ మధ్య కాలంలో దేవి హావ కొంచెం తగ్గింది కానీ, ఒకప్పుడు దేవి మ్యూజిక్ అంటే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు కూడా దేవి సరిగ్గా కూర్చొని కాన్సన్ట్రేషన్ చేస్తే అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇవ్వగలడు. దేవిశ్రీప్రసాద్ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి. అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్స్ అందించాడు దేవి. అలానే చాలామంది డైరెక్టర్స్ తో మంచి రిలేషన్ కూడా దేవికి ఉంది అని చెప్పొచ్చు.

ఇకపోతే రీసెంట్ టైంలో ఎస్ ఎస్ థమన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఇద్దరికీ మంచి మ్యూజిక్ అందించాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలు అన్నిటికీ కూడా థమన్ సంగీతం అందించాడు. అయితే దేవిశ్రీప్రసాద్ కూడా ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. పుష్ప సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్బమ్ అంతా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటలకి మంచి పేరు వచ్చింది.

Kanguva

- Advertisement -

ఇకపోతే దేవి ప్రస్తుతం అద్భుతమైన ప్రాజెక్టులను చేస్తున్నాడు. ఒకదాన్ని మించిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది అని చెప్పొచ్చు. శివ దర్శకత్వంలో సూర్య చేస్తున్న కంగువ సినిమాకి దేవి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫైర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ టైటిల్ లో చెప్పినట్లు సాంగ్ కూడా ఫైర్ లా ఉంది. చాలా రోజుల తర్వాత దేవిశ్రీ నుంచి బెస్ట్ వర్క్ వచ్చింది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో పాట మంచి హై ఇస్తుంది. దేవి ఫ్యాన్స్ కి ఇది ఒక ట్రీట్ లా అనిపించింది. అలానే సూర్య ఫ్యాన్స్ కి కూడా ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు