Chiranjeevi: కేంద్రంలో చిరంజీవికి కీలక పదవి.. కూతురు సంచలనం !

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ప్రస్తుతం రాజయోగం నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు వచ్చిన తర్వాత… వారి ఇంట వరుసగా… శుభకార్యాలే జరుగుతున్నాయి. రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయిన తర్వాత…. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అనూహ్యంగా జరిగింది. ఇక వీరి వివాహం… జరిగిన వెంటనే…. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… మొన్నటి ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నారు.

2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్… ఈసారి ఏపీలో 100% స్ట్రైక్ రేట్ తో తన పార్టీని గెలిపించుకున్నాడు. జనసేన ను గెలిపించుకోవడమే కాకుండా ఆ తాను కూడా పిఠాపురం నియోజకవర్గంలో జెండా ఎగురవేశాడు పవన్ కళ్యాణ్. ఇంకేముంది పవన్ కళ్యాణ్ గెలవడం… అటు కూటమి అధికారంలోకి రావడంతో… డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ ను వరించింది.

Chiranjeevi Congratulates His Daughter Sushmita Konidela

- Advertisement -

అటు కేంద్రంలో… మోడీ పార్టీకి తక్కువ సీట్లు రావడంతో…. టిడిపి అలాగే జనసేన పార్టీలు కోరిన కోర్కెలన్నీ ఎన్డీఏ ప్రభుత్వం తీర్చుతోంది. ఇందులో భాగంగానే త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగింది. మొన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. రాజ్యసభకు పంపిన తర్వాత కేంద్ర కేబినెట్ హోదా కూడా చిరంజీవికి వస్తుందని అందరూ ప్రచారం చేశారు.

అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత…. క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత ఈ సందర్భంగా మాట్లాడుతూ… మెగాస్టార్ చిరంజీవి గారికి… రాజ్యసభ సీటు వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయంపై ఇప్పటి వరకు మా ఇంట్లో చర్చ జరగలేదు. రాజకీయాల గురించి ఇంట్లో అస్సలు మాట్లాడుకోము. కేవలం పవన్ కళ్యాణ్ బాబాయ్ విజయం గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకుంటూ చర్చించుకుంటున్నాము.. అని సుస్మిత వెల్లడించింది. దీంతో సుస్మిత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు