Swag Update : సింగ వచ్చేశాడు… ఇంక ఇంటర్నెట్ బద్దలే

Swag Update : ఈ ఏడాది మొదట్లోనే ఓం భీమ్ బుష్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు తాజా చిత్రం స్వాగ్. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన పెళ్లిచూపులు ఫేమ్ రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తుండగా, వివేక్ కూచిబోట్లా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగనిక వంశం కథగా కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది స్వాగ్. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా సింగరో సింగా అనే ఫస్ట్ వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన అప్డేట్ ను తాజాగా ప్రకటిస్తూ స్వాగ్ కింగ్ సింగ వచ్చేశాడు. ఇంకా ఇంటర్నెట్ బద్దలే అంటూ పాటను రిలీజ్ చేశారు. మరి ఆ పాట విశేషాలు ఏంటో ఒక లుక్కేద్దాం పదండి.

క్యాచీ లిరిక్స్ తో సూపర్ సాంగ్

పాపులర్ సింగర్ బాబా సెహగల్ సింగరో సింగర్ పాటను పాడారు. ఇది రాప్ స్టైల్ లో ఉండగా, లిరిక్స్ క్యాచీగా ఉండి యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ లవర్స్ ను ఈ సాంగ్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక ఈ వీడియో సాంగ్ లో బాబా సెహగల్ శ్రీవిష్ణుతో కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య సాగే లిరికల్ డైలాగ్స్, మధ్యలో హీరోయిన్ దక్షా ఎంట్రీ అదిరిపోయాయి. ఈ పాటకు నిఖిలేష్ సుంకోజి లిరిక్స్ అందించగా, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ పాటను బాబా సెహగల్ తో కలిసి వైకోం విజయలక్ష్మి పాడారు. ట్రెండీగా ఉన్న ఈ వీడియో సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.Image

ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్

ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక అందులో భాగంగా గత కొంతకాలం నుంచి సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ కు కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే హీరోయిన్ రీతు వర్మ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా, ఆమె రాజసం ఉట్టిపడే రాయల్ లుక్ లో అదరగొట్టింది. ఇందులో వింజామర వంశపు రాణి రుక్మిణి దేవి పాత్రలో రీతు వర్మ కనిపించబోతోంది. మగ అహంకారానికి మహారాణి గారి సమాధానం… రాజులను తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మిణి దేవి అంటూ ప్రేక్షకులకు రీతు వర్మను పరిచయం చేసి, సూపర్ బజ్ క్రియేట్ చేసారు మేకర్స్. అలాగే స్వాగ్ మూవీలో దక్షా నగార్కర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హీరోయిన్ స్వాగ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. స్వాగ్ ప్రపంచానికి మరింత రాజసం.. అచ్చ తెలుగు సినిమా ఎక్స్పీరియన్స్ లోడింగ్ అంటూ దక్ష లుక్ ను షేర్ చేశారు. రీసెంట్ గా సింగరో సింగ అంటూ రిలీజ్ చేసిన ప్రోమోకి కూడా మంచి ఆదరణ దక్కింది. తాజాగా రిలీజైన సింగరో సింగ ఫుల్ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు