Swapna Dutt: ఆయన లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు – నిర్మాత..!

Swapna Dutt: టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం కల్కి 2898AD .. ఈ సినిమాకు ముందు ఈయన తీసింది కేవలం రెండు సినిమాలే.. ఇక మూడవ సినిమాను ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసి భారీ ఇమేజ్ దక్కించుకున్నారు.. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ పేరు పాన్ ఇండియా లెవెల్లో వినిపిస్తూ ఉండడం గమనార్హం. నాగ్ అశ్విన్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. భార్య ప్రియాంక దత్.. ఈమె ఎవరో కాదు ప్రముఖ నిర్మాతగా పేరుపొందిన వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ కుమార్తె.. అయితే నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ ఇద్దరూ కూడా ప్రేమించే వివాహం చేసుకున్నారు.. పైగా వీరిది కులాంతర వివాహం కూడా.. మరొకవైపు ప్రియాంక దత్ చెల్లెలు స్వప్న దత్ కూడా ప్రేమ వివాహం చేసుకుంది.. అది కూడా కులాంతర వివాహమే.. మరి ఈ కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు అనే విషయానికి వస్తే.. వీరిద్దరి వివాహం జరగడానికి కారణం ఒక స్టార్ హీరో అన్నట్టుగా తెలుస్తోంది.. వాటి గురించి తెలుసుకుందాం.

Swapna Dutt: My wedding wouldn't have happened without him - producer..!
Swapna Dutt: My wedding wouldn’t have happened without him – producer..!

ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు – స్వప్న దత్

తన ప్రేమ పెళ్లి జరగడానికి ఎన్టీఆర్ కారణం అని చెబుతోంది స్వప్న దత్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాలను వెల్లడించింది.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి మంచి పేరు ఉండడమే కాదు.. ప్రాణమిచ్చే స్నేహితులు కూడా ఉన్నారు. అలా జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణమిచ్చే వారిలో దిగ్గజ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ చిన్న కూతురు స్వప్న దత్ కూడా ఒకరు.. ఈమె తండ్రి అడుగు జాడల్లోనే సినీ రంగంలో నిర్మాతగా కొనసాగుతోంది.. ఆజాద్ సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన స్వప్న… ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ సినిమాకు పూర్తిస్థాయిలో నిర్మాతగా మారింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.. కానీ నిరాశ చెందకుండా వెబ్ సిరీస్ ,షార్ట్ ఫిలిం లు తీస్తూ వచ్చిన ఈమె.. పదేళ్ల తర్వాత నాని హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను నిర్మించి మంచి హిట్ కొట్టింది.. ఆ వెంటనే మహానటి, సీతారామం ,ఇప్పుడు కల్కి చిత్రాలతో వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంది.

నాన్న సీరియస్ అయ్యారు.. ఎన్టీఆర్ ఒప్పించారు..

ఈ నేపథ్యంలోని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వప్న దత్ మాట్లాడుతూ… తన వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇచ్చింది ..ఈమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు.. నేను ప్రసాద్ వర్మను ప్రేమించాను.. ఈ విషయాన్ని నాన్నకు చెప్పే ధైర్యం లేదు. మా ఇద్దరివి వేరువేరు కులాలు కావడంతో కచ్చితంగా ఒప్పుకోరు అనే భయం ఉండేది. అయితే ఈ విషయాన్ని శక్తి సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి చెప్పాను. ఆయన ఇలాంటి విషయాలు అసలు లేటు చేయవద్దు.. నేను వెళ్లి మీ నాన్నతో మాట్లాడతానని మాట ఇచ్చారు…ఒకరోజు సినిమా షూటింగ్ అయిన తర్వాత ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. నా ప్రేమ విషయాన్ని నాన్నకి చెప్పారు.. అయితే నాన్న ఆ మాట వినగానే ఒప్పుకోకపోగా.. చాలా సీరియస్ అయ్యారు.. అయినప్పటికీ ఎన్టీఆర్ నాన్నను చాలా కన్విన్స్ చేశారు… ఎట్టకేలకు నాన్న ఒప్పుకోవడంతో 2010లో ప్రసాద్ వర్మతో నా పెళ్లి జరిగింది. అలా ఎన్టీఆర్ నా ప్రేమ, పెళ్లి విషయంలో ఎంతో సహాయం చేశారు అంటూ ఎమోషనల్ అయింది స్వప్న దత్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు