Swayambhu: అన్ని భాగాలు కథ ఉంది, అది సీరియలా.? సినిమానా.?

Swayambhu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో నిఖిల్ ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతోనే నిఖిల్ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పరశురాం దర్శకత్వంలో యువత అనే సినిమాలో కనిపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నిఖిల్ హీరోగా వరుస సినిమాలో చేశాడు. అయితే సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన స్వామిరారా సినిమా నిఖిల్ కెరియర్లో మంచి హిట్ అయింది.

ఆ తర్వాత ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాడు నిఖిల్. చందు ముండేటి దర్శకుడుగా పరిచయమైన కార్తికేయ సినిమా మంచి రెస్పాన్స్ ను సాధించుకుంది. అయితే నిఖిల్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చింది. కార్తికేయ 2 పేరుతో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. అక్కడితో నిఖిల్ రేంజ్ కూడా పెరిగిపోయింది. కనీసం థియేటర్లు కూడా దొరకని ఈ సినిమాకు మౌత్ టాకు వలన రోజురోజుకు థియేటర్లో పెరిగి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సంచలనాన్ని నమోదు చేసుకోవడానికి స్కోప్ దొరికింది. ఆ తర్వాత నిఖిల్ కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

కార్తికేయ సినిమా తర్వాత వచ్చిన 18 పేజీస్ సినిమా కూడా మంచి రెస్పాన్స్ ను సాధించుకుంది. సూర్య ప్రతాప్ పలనాటి దర్శకత్వం వహించిన ఈ లవ్ స్టోరీ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత స్పై అనే ఒక సినిమాను చేశాడు నిఖిల్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ స్వయంభు అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

- Advertisement -

Nabha Natesh

ఈ సినిమాలో నబా నటేష్ ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలో భరతనాట్యం చేసే పాత్రలో నభ నటేష్ కనిపించబోతున్నట్లు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయంతో పాటు స్వయంభు గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది మొత్తం ఈ సినిమాకి సంబంధించి ఆరు భాగాలు స్టోరీ ఈ దర్శకుడు దగ్గర ఉందని చెప్పింది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది సీరియల్ లేక సినిమానా అంటూ కొంతమంది వెటకారంగా కూడా కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు