Sye: చాలామంది హీరోస్ కు వర్కౌట్ కాలేదు, నితిన్ సినిమాకు వర్కౌట్ అవుతుందా.?

Sye: రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ ట్రెండ్ జరుగుతున్న విషయం తెలిసింది. ప్రతి హీరో పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అభిమానులు పాత సినిమాలను రీ రిలీజ్ చేసి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు(Pokiri) పోకిరి(Pokiri) వంటి సినిమాలను రీ రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రీ రిలీజ్ సినిమాని కూడా ఇంతలా ఎంజాయ్ చేయొచ్చు అని అప్పుడే అంతమందికి తెలిసి వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన తమ్ముడు జల్సా సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి.

ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన దేశముదురు(Desamudhuru). ప్రభాస్ నటించిన వర్షం(Varsham), ఎన్టీఆర్(Ntr) నటించిన సింహాద్రి(Simhadri) వంటి హిట్ సినిమాలు కూడా రిలీజ్ చేశారు. అయితే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజులకి వచ్చినంత క్రౌడ్ రిమైనింగ్ సినిమాలకి రాలేదు అని చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళకి స్టార్డమ్ వచ్చింది కానీ ఒకప్పుడు వీళ్లంతా సాధారణమైన హీరోలని చెప్పాలి. రామ్ చరణ్ నటించిన డిజాస్టర్ సినిమా ఆరెంజ్ కి మాత్రం విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాలేజీ యూత్ అంతా కూడా ఆ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశారు.

Sye

- Advertisement -

నీకు తెలుగు సినిమాలను మినహాయిస్తే సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ , సెల్వ రాఘవన్ తీసిన సెవెన్ జి బృందావన్ కాలనీ వంటి సినిమాలకు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న సై సినిమాను త్వరలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ వంటి హీరోల సినిమాలకు సరైన ఆదరణ దక్కకుండా ఆ సినిమా రి లీజులు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నితిన్ కు వర్కౌట్ అవుతుందా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలో ఈ సినిమాని రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ఎంతటి ఆదరణ దక్కుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు