T20 World Cup : జైలు సెంటిమెంట్… ఆ హీరో జైలుకు వెళ్లడం వల్లే భారత్ కప్ కొట్టింది…

T20 World Cup :ఈ సమాజంలో కొన్ని విషయాలు చాలా యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి ఒకదానితో ఒకటి సంబంధం లేదు అని అనుకున్న కూడా కొన్ని విషయాలను చూస్తే దానికి దీనికి ఏదో సంబంధం ఉంది అని అనిపించక మానదు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించి సంచలనం సృష్టించిన కేసు దర్శన్ ది. హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా కేసులో ఇరుక్కుపోయిన తర్వాత చాలామందికి దర్శన్ గురించి ఒక క్లారిటీ వచ్చింది.

తమ అభిమాని రేణుక స్వామిని దర్శన్ హత్య చేయించిన విషయం చాలామందికి తెలిసిందే. ఎంత దారుణంగా హత్య చేశాడు ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇటువంటి ట్రీట్మెంట్ దర్శన్ కి కూడా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వైరల్ గా మారాయి. ఇకపోతే రీసెంట్గా ఇంకో ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దర్శన్ మీద ఉన్నవి తక్కువ కేసులు కాదు. ఇదివరకే చాలాసార్లు దర్శన్ జైలు పాలు అయ్యాడు. దర్శన్ జైలు పాలైన ప్రతిసారి ఇండియాకి ఏదో కలిసి వస్తుందని చెప్పొచ్చు.

Darshan

- Advertisement -

దర్శన్ 2011 లో జైలుకు వెళ్ళినప్పుడు ఇండియా వరల్డ్ కప్ సాధించింది. అలానే 2013లో జైలుకు వెళ్ళినప్పుడు ఛాంపియన్ ట్రోఫీ. ఇక మళ్లీ 2024 లో దర్శన్ జైలు పాలు అవడంతో ఇండియాకి ప్రపంచ కప్ లభించింది. అయితే ప్రస్తుతం ఇలా పోస్ట్లు పెడుతూ కంప్లీట్ గా దర్శన్ జైల్లో ఉండటమే కరెక్ట్ అంటూ చాలామంది అంటూ వస్తున్నారు. ఏదేమైనా తెలుగు హీరోలు తమ అభిమానుల్ని ప్రేక్షకు దేవుళ్ళు అని పిలిస్తే ఈ కన్నడ హీరో మాత్రం తమ అభిమానిని హత్య చేయించే అంత దారుణమైన పని చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు