Taapsee : మళ్ళీ నోరు పారేసుకున్న తాప్సీ… అంబానీ అని కూడా చూడకుండా ఇలా ఇచ్చిపడేసిందేంటి?

Taapsee : సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాంట్రవర్సీ బ్యూటీలలో తాప్సి కూడా ముందు వరుసలో ఉంటుంది. టాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన ఈ బ్యూటీ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. తాజాగా ఏకంగా అంబానీ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అంబానీ అని కూడా చూడకుండా తనదైన స్టైల్ లో ఇచ్చి పడేసింది. అసలు ఇంతకీ ఈ బ్యూటీ అంబానీ పెళ్లి విషయంలో ఎలాంటి కామెంట్స్ చేసింది? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

అలాంటి పెళ్ళికి వెళ్ళను

తాప్సి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయ్యాక టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ లో కూడా తన దృష్టికి వచ్చిన విషయాలపై కుండబద్దలు కొట్టినట్టుగా అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది తాప్సి. తాజాగా అంబానీ పెళ్లిపై ఆమె నుంచి వచ్చిన రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది. అత్యంత ఘనంగా నాలుగు రోజులపాటు జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లికి దాదాపు 5000 కోట్లను ఖర్చు పెట్టింది అంబానీ ఫ్యామిలీ. ఈ వేడుకకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ దంపతులు, సూపర్ స్టార్ రజినీకాంత్, అట్లీ, యశ్ వంటి పలువురు సౌత్ స్టార్స్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కానీ తాప్సి మాత్రం ఈ పెళ్లికి రాకుండా ఉండిపోయిన సెలబ్రిటీల లిస్ట్ లో చేరింది. ఈ నేపథ్యంలోనే తాను పెళ్లి జరుగుతున్న కుటుంబానికి, గెస్ట్ కు మధ్య కనీసం ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ ఉండే వివాహానికి మాత్రమే వెళ్తానంటూ బాంబు పేల్చింది.

- Advertisement -

Taapsee Pannu gets married in a secret wedding: Reports

అంబానీ పెళ్ళిపై తాప్సీ షాకింగ్ కామెంట్స్

సాధారణంగా అంబానీల పెళ్లికి ఇన్విటేషన్ రావడం అనేది సెలబ్రిటీ లందరూ ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. అందుకే సౌత్ నుంచి నార్త్ వరకు ఇంత మంది తారలు అనంత్ అంబానీ పెళ్లిలో వేడుకలో సందడి చేశారు. అయితే నిజంగానే తాప్సి అన్నట్టుగా ఎక్కడా అంబానీ ఫ్యామిలీ వీళ్లను దగ్గరుండి అతిథులుగా పలకరించినట్టుగా కనిపించలేదు. అందరూ రావడం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వెళ్ళిపోవడం ఇదే తంతు జరుగుతుంది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు డబ్బులు తీసుకుని అంబానీ వేడుకకు హాజరవుతున్నారని టాక్ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మీరు ఎందుకు అంబానీ పెళ్లికి వెళ్లలేదు అనే ప్రశ్నకు తాజాగా తాప్సి బదులిస్తూ వ్యక్తిగతంగా వాళ్ల గురించి నాకు పెద్దగా తెలియదు. వివాహాలు అనేవి వ్యక్తిగతమైన విషయాలు. పెళ్లిలో వాళ్ల స్నేహితులు చాలామంది ఉన్నారు. కానీ కుటుంబం, అతిధి మధ్య కనీసం ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ ఉండే వివాహానికి మాత్రమే నేను వెళ్ళాలి అని భావిస్తున్నాను” అంటూ స్ట్రాంగ్ గానే బదిలిచ్చింది. మరి తాప్సి ఆన్సర్ ఈసారి ఎలాంటి వివాదానికి తెర తీస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు