Taarak: పవన్ ప్లేస్ ని కొట్టేద్దాం అనుకుంటున్నా తారక్ … ఫ్యాన్స్ ఊరుకుంటారా…?

Taarak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లేస్ లోకి ఎన్టీఆర్ రాబోతున్నాడు అన్న న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాల అప్డేట్స్ ఏది రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు.

ఆయన నుంచి రావాల్సిన మూవీ ఈ ఏడాది రావడం లేదు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత క్రేజీ సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్ మూవీ ఓజీ. ముంబై మాఫియా ప్రధానంగా సాగే కథాంశం తో ఈ సినిమా రూపొందింది. సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. 15 రోజులు పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇస్తే ఈ మూవీ కంప్లీట్ అవుతుందట. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది రావడం లేదట.

taarak-wants-to-hit-pawans-place-will-the-fans-be-quie
taarak-wants-to-hit-pawans-place-will-the-fans-be-quie

బిజినెస్ లు సరిగ్గా లేవు అని నిర్మాతలపరంగా సమస్యలు తలెత్తయని ఆ క్రమంగానే ఈ సినిమా సెప్టెంబర్ 27న కాకుండా మరో డేట్ న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఇదే డేట్ కి ఇప్పుడు ఎన్టీఆర్ కర్చీఫ్ వేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఒకవేళ సెప్టెంబర్ 27న పవన్ సినిమా కనుక రిలీజ్ కాకపోతే ఈ డేట్ న దేవర రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు