Jailer : తమన్నా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ ?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసిన తమన్నా హవా ఈ మధ్య కాలంలో కాస్త తగ్గింది. మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్క్ బ్యూటీ అనాది కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలోనే తమన్నాకి హిందీ, తమిళ్ సినిమాల అవకాశాలు రావటంతో కొద్దిరోజులు తెలుగు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ తో కలిసి హిమ్మత్ వాలా అనే హిందీ సినిమాలో తమన్నా నటించింది. అందరి హీరోయిన్స్ లాగే సౌత్ సినిమాలు చేసి బాలీవుడ్ లో మకాం వేద్దామనుకున్న తమన్నాకి హిమ్మత్ వాలా ఫ్లాప్ తో బ్రేక్ పడి.. మళ్ళీ సౌత్ కి రిటర్న్ అయింది.

ఆ తరువాత తమన్నాకి ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమాలో అవకాశం రావడంతో తమన్నా దశ తిరిగిందనే చెప్పాలి. బాహుబలి సినిమా రిలీజై, ఎపిక్ బ్లాక్ బస్టర్ అవడంతో. తమన్నా కెరీర్ పరుగులు పెట్టింది. వరుస సినిమాలతో మరోసారి బిజీ గా మారిపోయింది. అయితే ఈ ఫ్లో ఎంతో కాలం లేదు. సాధారణంగా తమన్నా కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగా , ఆ మధ్య అభినేత్రి అనే ఒక హర్రర్ సినిమా చేసింది. ఇక తరువాత నుంచి తమన్నా కెరీర్ కొద్దిగా గాడి తప్పింది.

- Advertisement -

ఇక అప్పటి నుంచి యంగ్ హీరోల సినిమాలకి దూరమైన తమన్నా, చేతికందిన సినిమాలు చేస్తూ పోయింది. అయితే ప్రస్తుతం తమన్నాకి తెలుగులో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో మరియు రజనీకాంత్ జైలర్ సినిమాలో ఆమె నటిస్తుంది. జైలర్ సినిమా రెగ్యులర్ షూట్ జరుగుతుండగా, ఇటీవలనే షూటింగ్ లో పాల్గొన్న ఆమె తన ఇంస్టాగ్రామ్ లో షూటింగ్ పిక్ పోస్ట్ చేస్తూ.. డైరెక్టర్ నెల్సన్ ని ట్యాగ్ చేసింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు