Tamannah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం ఇటీవల విడుదలైన అరణ్మనై 4 విజయంతో ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే తాజాగా ఈ బ్యూటీ విజయ్ వర్మని కాదని ఆ స్టార్ హీరోతో డేట్ కి వెళ్ళాలని ఆశ పడుతున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి తమన్నా మాటలకు అర్థమేంటి? అంటే..
విజయ్ వర్మను పక్కన పెట్టి..
హీరోయిన్లు తమన్నా, రాశి ఖన్నా ఇద్దరూ తాజాగా హిందీ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. మీడియా ఇంటరాక్షన్ సమయంలో తమన్నా తాను సినిమా డేట్‌కి వెళ్లి, సినిమా చేయాలనుకుంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ పేరును వెల్లడించింది. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తమన్నా తన బాయ్‌ఫ్రెండ్‌కు విజయ్ వర్మ అని పేరును కాకుండా మరో స్టార్ హీరో పేరు చెప్పింది.
ఆ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంది
అరణ్మనై 4 కోసం ఏర్పాటు చేసిన హిందీ ప్రెస్ మీట్ లో తమన్నా భాటియా, రాశి ఖన్నాతో పాటు దర్శకుడు నటుడు సుందర్ సి ముంబైలో కన్పించారు. ప్రెస్ మీట్ లో భాగంగా సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అలాగే మీడియాతో సరదాగా ఇంటరాక్షన్ సందర్భంగా తమన్నా ఓ స్టార్ హీరోతో కలిసి పని చేయాలనే బలమైన కోరిక గురించి కూడా చెప్పింది.
తమన్నా మూవీ డేట్ అతనితోనే..
తన హార్రర్ కామెడీ అరణ్మనై 4ని తమన్నా ఎవరితో చూడాలనుకుంటున్నారు? అనే ప్రశ్న ఎదురు కాగా, తమన్నా స్పందిస్తూ కాస్త మొహమాట పడింది. తరువాత ఆ ప్రశ్న నుంచి ఎస్కేప్ కావాలని చూసింది. కానీ ఆమెకు సమాధానం చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక ఆ ప్రశ్నకు తమన్నా తెగ సిగ్గు పడిపోతుండడం చూసి ఆమె విజయ్ వర్మ పేరును చెప్తుందని అక్కడున్న వారంతా ఎక్స్పెక్ట్ చేశారు.
కానీ తమన్నా మాత్రం తెలివిగా సమాధానం చెప్పింది. తనకు షారూఖ్ అంటే ఇష్టమని ఈ సందర్భంగా మిల్కీ బ్యూటీ తన మనసులోని మాటలను బయట పెట్టింది. అంతేకాదు ఆయనతోనే మూవీ డేట్ కు వెళ్లాలని ఆశ పడుతున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక షారూఖ్ తో కలిసి సినిమా చేయాలనే కోరికను ప్రెస్ ముందు వ్యక్తం చేసింది. మరి షారుక్ ఈ బ్యూటీతో ఎప్పుడు రొమాన్స్ చేస్తాడో చూడాలి. లేదా ఆమె షారూఖ్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందేమో, ఆ విషయాన్ని ఇలా ఇన్ డైరెక్ట్ గా కూడా చెప్పి ఉండవచ్చు.
ఈ ఏడాది ఫస్ట్ 100 కోట్ల మూవీ
తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి ముఖ్య పాత్రల్లో నటించిన అరణ్మనై 4 అనే హారర్ మూవీ మె 3 న థియేటర్లలోకి వచ్చింది. కలెక్షన్ల పరంగా ఈ మూవీ అద్భుతమైన రికార్డును క్రియేట్ చేసింది. 2024లో 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మూవీగా అరణ్మనై 4 హిస్టరీని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.