Tamannah: అతనితో రొమాన్స్‌‌ను ఎంజాయ్ చేస్తా.. తమన్నా హాట్‌ కామెంట్స్‌ !

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటనతో ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ లో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. “శ్రీ” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాల్లో నటించి కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ అమ్మడు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

తెలుగుతో పాటు…. కన్నడ, తమిళ్, హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది ఈ బ్యూటీ. ఈ భామ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది. 4 పదుల వయసు వచ్చినప్పటికీ ఈ అమ్మడు ఏమాత్రం తరగని అందంతో ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. తమన్నా అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతారు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంత వయసు వచ్చినప్పటికీ తమన్నా ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు.

కానీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారని సమాచారం. అయితే తాజాగా తమన్నా సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి. తమన్నా నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీ-1 వెబ్ సిరీస్ చూసిన తర్వాత శృ**గార సన్నివేశాలపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తమన్నా మాట్లాడారు.

- Advertisement -

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ…. ప్రేక్షకులు తనని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే తనను తాను చూపించుకోవడం తనకు చాలా అవసరం అన్నారు. అంతేకాదు లస్ట్ స్టోరీస్-2 కోసం చేసిన బోల్డ్ సీన్స్ లో తనకు అస్సలు టెన్షన్ అనిపించలేదని…. విజయ వర్మతో రొమాన్స్ చేసే సన్నివేశాలలో అతనితో ఎంజాయ్ చేస్తానని తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు