Tamannah : తమన్నా న్యూ ఐటమ్ సాంగ్ చూశారా? ఆమె డ్యాన్స్ చూస్తే నిద్ర పట్టడం కష్టమే

Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా తాజా ఐటం సాంగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది. అందులో తమన్నా అందాలు ఆరబోస్తూనే కిక్ ఇచ్చే కిల్లింగ్ స్టెప్పులతో అదరగొట్టింది. ఆమె రీసెంట్ బ్లాక్ బస్టర్ సాంగ్ నువ్వు కావాలయ్యాను మరిపించేలా చేస్తున్న ఆ సాంగ్ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

మరోసారి ఐటం సాంగ్ తో ఊపేస్తున్న తమన్నా

2018లో వచ్చిన హిందీ హారర్ మూవీ స్త్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ శ్రద్ధా కపూర్, ప్రముఖ హీరో రాజ్‌ కుమార్ రావ్ జంటగా నటించారు. అయితే ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. స్త్రీ మూవీకి సీక్వెల్ గా స్త్రీ2 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానాతో సహా ‘స్త్రీ 2’లో మొదటి భాగంలోని చాలా మంది ప్రధాన తారాగణం మరోసారి కంపించబోతున్నారు. ఈ సినిమాను మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. అయితే స్త్రీ 2  మూవీ హారర్ సిరీస్ లో వస్తున్న 5వ మూవీ. నిరేన్ భట్ ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించగా,  దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే నిర్మిస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.

Aaj Ki Raat Video: Scintillating Tamannaah & Her Silky Moves!

- Advertisement -

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ సినిమాపై విపరీతమైన హైప్‌ని సృష్టించింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లలో భాగంగా టీమ్ ఈ చిత్రాన్ని విస్తృతంగా ప్రమోట్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా స్త్రీ 2 మేకర్స్ అధికారికంగా తమన్నా భాటియా చేసిన స్టీమీ డ్యాన్స్ నంబర్ ‘ఆజ్ కీ రాత్’ అనే మొదటి పాటను విడుదల చేశారు. ఇక ఇందులో తమన్నా చేసిన మ్యాజికల్ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే బుర్ర తిరగడం ఖాయం. ఈ సాంగ్ లో తమన్నా తన మిల్కీ అందాలతో అదరగొట్టడమే కాదు అదిరిపోయే కొత్త స్టెప్పులతో మైండ్ బ్లాక్ అయ్యే ఎక్స్ ప్రెషన్స్ తో చంపేస్తోంది. తాజాగా ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమన్నాతో పాటు రాజ్‌కుమార్ రావ్, అభిషేక్, పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా కూడా ఈ పాటలో తమ ఫన్నీ డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించారు. మధుబంతి బాగ్చి, దివ్య కుమార్, సచిన్-జిగర్ ఈ పాటను పాడారు. అమితాబ్ భట్టాచార్య సాహిత్యం రాశారు. సచిన్-జిగర్ ఈ ట్రాక్‌ని కంపోజ్ చేసారు.

తమన్నా ఐటమ్ సాంగ్స్

తమన్నాకు ఐటం సాంగ్స్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఈ బ్యూటీ ‘కేజీఎఫ్’, ‘జై లవ కుశ’, ‘అల్లుడు శీను’, ‘జాగ్వార్’ వంటి మరెన్నో సౌత్ చిత్రాలలో ఐటం సాంగ్స్ చేసిన మిల్కీ బ్యూటీ ఇటీవలే నువ్వు కావాలయ్యా అంటూ జైలర్ సినిమాలోని పాటతో మూవీ లవర్స్ ను ఒక ఊపు ఊపేసింది. తాజాగా మరోసారి ఆజ్ కీ రాత్ అంటూ అదరగొట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు