Devara: గ్లోబల్ ఛార్ట్స్ లో తారక్ ” దేవర ” సరికొత్త సెన్సేషన్..!

Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇక ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్ గానే అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయగా ఇది పాన్ ఇండియన్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

అనిరుద్ కంపోజ్ చేసిన ఈ ఫియర్ సాంగ్ అయితే ఇప్పుడు గ్లోబల్ లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా యూట్యూబ్ మ్యూజిక్ చాట్ లో ఈ ఫియర్ సాంగ్ ప్రస్తుతం టాప్ 100 పాటల్లో 29వ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. దీంతో ఈ సాంగ్ సెన్సేషన్ ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tarak's "Devara" is the latest sensation in the global charts
Tarak’s “Devara” is the latest sensation in the global charts

ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో అయితే భారీ రెస్పాన్స్ ని కొనసాగిస్తుంది. దీంతోనే గ్లోబల్ ఛార్ట్స్ లో కూడా అదర కొట్టడం విశేషం. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు